మొత్తానికి పూరి సత్తా ఫ్రూవ్ అయ్యింది. ఇప్పటికే టెంపర్ తర్వాత ఆరు వరుస ప్లాపులు ఇచ్చిన పూరి ఇస్మార్ట్ శంకర్‌తో తానేంటో కొంత వరకు ఫ్రూవ్ చేసుకున్నాడు. పూరి రొటీన్ టేకింగ్ మారకపోయినా ఎంచుకున్న కథ కొత్తగా ఉండడం… ఇటు రామ్ క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేసుకోవడంతో పాటు అటు మాస్‌ను కనెక్ట్ చేసేలా ట్రైలర్లు వదలడం… ఇటు హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌తో ఈ సినిమా చూడాలన్న ఆతృతతో యూత్ ఉండడంతో తొలి రోజు సినిమాకు ఎవ్వరూ ఊహించని విధంగా షాకింగ్ వసూళ్లు వచ్చాయి.
రూ.18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఏకంగా రూ 7.83 కోట్లు అంటే దాదాపు రూ.8 కోట్ల వసూళ్లు వచ్చాయి. సినిమాకు టాక్ ఓకే అనిపించుకోవడంతో పాటు సోలోగా రావడం.. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇస్మార్ట్ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సేఫ్ వెచంర్ అయినట్టే. అయితే ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తే పూరికి మళ్లీ పెద్ద ఛాన్సులు వస్తాయి.
ఇస్మార్ట్ శంకర్ డే 1 కలెక్షన్స్ (రూ.కోట్లలో):
నైజాం – 3.43
సీడెడ్ – 1.20
వైజాగ్ – 0.86
ఈస్ట్ – 0.50
వెస్ట్ – 0.40
కృష్ణ – 0.53
గుంటూరు – 0.57
నెల్లూరు – 0.30
————————————–
ఏపీ + తెలంగాణ = 7.83 కోట్లు
————————————–
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.58 కోట్లు
ఓవర్సీస్ – 0.25కోట్లు
టోటల్ 1స్ట్ డే వరల్డ్‌వైడ్ – 8.66కోట్లు