సూప‌ర్ క్రైం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ” రాక్ష‌సుడు ” ట్రైల‌ర్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరైన హిట్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. అగ్ర ద‌ర్శ‌కుల‌తో వ‌రుస‌పెట్టి భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసినా మ‌నోడికి రేంజ్‌కు త‌గ్గ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ప‌డ‌డం లేదు. ఈ యేడాది ఇప్ప‌టికే సీత సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన శ్రీనివాస్ త్వ‌ర‌లోనే రాక్ష‌సుడు సినిమాతో మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి దిగ‌నున్నాడు.

ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. 1.51 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ చూస్తుంటే క్రైం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాగా తెలిసిపోతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌లోనూ ఇదే విష‌యాన్ని చెప్పేశారు. బెల్లంకొండ గత చిత్రాల మాదిరి భారీ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు లేకుండా కథా ప్రాధాన్యంగా ట్రైల‌ర్ క‌ట్ చేశారు. కోలీవుడ్లో హిట్ అయిన రాచ్చ‌స‌న్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోంది.

సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచేసింది. సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో హీరో ఇన్వెస్ట్‌గేష‌న్ టీంలో ఉంటాడ‌ని తెలుస్తోంది. సైకో కిల్ల‌ర్ ఎక్క‌డ ? ఎలాంటి త‌ప్పు చేస్తాడ‌నే వీళ్లు వెయిట్ చేస్తుంటారు.

బెల్లంకొండ శ్రీనివాస్ రాక్ష‌సుడులో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ లేని బెల్లంకొండ ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తాడేమో ? చూడాలి.

https://youtu.be/zhwMSTRl_nw

Leave a comment