అమలా పాల్ ‘ఆమె’ రివ్యూ & రేటింగ్

సినిమా: ఆమె
నటీనటులు: అమలా పాల్, రమ్య సుబ్రహ్మణ్యన్, శ్రీరంజిని, వివేక్ ప్రసన్న తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్
సంగీతం: ప్రదీప్ కుమార్
నిర్మాత: రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని
దర్శకత్వం: రత్నకుమార్

తమిళ స్టార్ బ్యూటీ అమలా పాల్ నటించిన తాజా చిత్రం ‘ఆమె’ సెన్సేషన్‌కు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పూర్తిగా నగ్నంగా నటించిన అమలా పాల్ ఒక్కసారిగా అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈ చిత్ర టీజర్, పోస్టర్స్‌లో అమ్మడు నూలుపోగు లేకుండా కనిపించి పలు వివాదాలకు తెరతీసింది. పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
కామిని(అమలాపాల్) వెస్ట్రన్ కల్చర్ మైండ్‌సెట్‌తో ఉన్న అమ్మాయి. తన స్నేహితులతో జాలీగా జీవనం సాగిస్తుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో బెట్ కడుతూ గెలవడం అమ్మడికి బాగా ఇష్టం. కట్ చేస్తే.. ఒకరోజు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మందేసిన కామిని ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. కాగా కామిని ఓ పాడుబడ్డ బంగ్లాలో నగ్నంగా ఉంటుంది. అసలు తాను అక్కడికి ఎలా చేరుకుంది..? ఆ రోజు ఏం జరిగింది..? పోలీసులను షాక్‌కు గురిచేసే అంశం ఏమిటి..? చివరకు కామిని ఏమౌతుంది..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్టాఫ్ మొత్తం కామిని ఇంట్రొడక్షన్.. ఆమె జీవనం సాగిస్తున్న విధానం.. స్నేహితులతో కలిసి చేసే హంగామాను చూపించారు. అందరితో బెట్ కాస్తూ గెలిచే మనస్తత్వం ఉన్న కామినిని తల్లి వారిస్తుంది. కట్ చేస్తే.. స్నేహితులతో కలిసి ఓ రోజు ఫుల్లుగా మందు తాగిన కామిని.. ఇంటికి చేరుకోదు. దీంతో తల్లి హైరానా పడి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కాగా కామిని తాను ఓ పాడుబడ్డ బిల్డింగ్‌లో నగ్నంగా పడి ఉంటుంది. ఒక ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాపై ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఇక సెకండాఫ్‌లో జరిగే కొన్ని థ్రిల్లర్ సీన్స్‌తో ఆడియెన్స్ సినిమాలో లీనమవుతారు. వరుసగా జరిగే కొన్ని మర్డర్లు, వాటిని చేసేది ఎవరు అనే సస్పెన్స్‌ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్ పూర్తిగా షాక్‌కు గురిచేస్తాయి. క్లైమాక్స్‌ను ప్రశాంతంగా ముగించడంతో సినిమాకు మంచి ఫినిషింగ్ ఇచ్చిన ఫీల్ కలుగుతుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం జనాలు నరాలు తెగిపోయే ఉత్కంఠతో తెరకెక్కించిన విధానం సినిమాకు బాగా కలిసొచ్చాయి.

ఓవరాల్‌గా లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా జనాలకు పిచ్చెక్కిస్తుంది. కేవలం థ్రిల్లర్ మూవీగానే కాకుండా ఓ మెసేజ్‌ను కూడా ఇస్తుంది ఆమె. మొత్తానికి అమలా పాల్ చేసిన బోల్డ్ అటెంప్ట్ వివాదాలకు ఎంత కేరాఫ్‌గా మారిందో అదే తరహాలో ఈ సినిమా కూడా అంతే ఇంప్రెస్ చేసిందని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాను సోలోగా లాక్కొచ్చిన క్రెడిట్ అమలా పాల్‌ సొంతం చేసుకుంది. యాక్టింగ్ పరంగా అమలా పాల్ తనలోని నటిని పూర్తిగా చూపించింది. ఎక్కడా ఆడియెన్స్‌ను కళ్లు తిప్పకుండా చేసింది ఈ బ్యూటీ. సస్పెన్స్ సీన్స్‌లో అమ్మడి యాక్టింగ్ పీక్స్. ఇక సినిమాలో మిగతా నటీనటులు వారి పాత్రలు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రత్నకుమార్ రాసుకున్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి సస్పెన్స్ అంశాలను జోడించి ఓ ఇంట్రెస్టింగ్ కథను మనముందుకు తీసుకొచ్చాడు. ఎక్కడా కూడా ఆడియెన్స్‌ను సైడ్ ట్రాక్ పట్టకుండా తాను రాసుకున్నది రాసుకున్నట్లుగా చూపించాడు. అటు థ్రిల్లింగ్ అంశాలను చూపిస్తూనే మెసేజ్‌ను కూడా అందించాడు ఈ దర్శకుడు. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతి సీన్‌ను చాలా బాగా చూపించారు. కొన్ని సీన్స్ టేకింగ్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేశారు. మ్యూజిక్‌కు పెద్దగా స్కోప్‌లేని సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
సస్పెన్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన ఆమె!

రేటింగ్: 2.75/5.0

Leave a comment