విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ తెచ్చుకుంది. యూత్ లో విజయ్ కు తిరుగులేని క్రేజ్ ఉండటంతో పాటు గీత గోవిందం – అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో విజయ్ మార్కెట్ పీక్స్ కు వెళ్లి పోవడంతో డియర్ కామ్రేడ్ సినిమా సైతం భారీ రేట్లకు కొన్నారు. సినిమాకు మొదటి నుంచే ప్రారంభమైన డివైడ్ టాక్ పాజిటివ్ టాక్ మారకపోవడం వసూళ్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమాకు అందరు గీతగోవిందం రేంజ్ ఊహించుకుని భారీ రేట్లు పెట్టేశారు.
యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే భారీ ఆఫర్ ఇచ్చి రైట్స్ ని సొంతం చేసుకున్నారు. వాస్తవంగా చూస్తే ఏ హీరో సినిమా అయినా అతడి మార్కెట్ రేంజ్ బట్టి కొనాలే తప్ప ఆ హీరో బ్లాక్ బస్టర్ సినిమాకు వచ్చిన వసూళ్లను చూసి ప్రతి సినిమాను హై రేట్లకు కొంటే కష్టాలు తప్పవు. ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. అయితే వీకెండ్ పూర్తయినా సినిమా హాఫ్ మిలియన్ మార్కు మాత్రమే దాటింది.
సోమవారం నుంచి వీక్ డేస్ కావడంతో ఫికప్ అయ్యే ఛాన్స్ లేదు. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి కొత్త సినిమాలు ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. హాలిడేస్ కాబట్టి నిన్న రెండు రోజులు ఓ మాదిరిగా వచ్చాయి కానీ అసలైన ఛాలెంజ్ ఇవాళ్టి నుంచి ఉంది. ఇక డబ్బింగ్ వెర్షన్లో కన్నడ-తమిళ్-మలయాళంలో రిలీజ్ చేస్తే అక్కడ ఆడియన్స్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు.
అసలు అక్కడ క్యూబ్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. అక్కడ వసూళ్లు చెప్పుకోవడానికి కూడా యూనిట్ ఇష్టపడటం లేదు. దీనిని బట్టే ఈ సినిమా డిజాస్టర్ దిశగా వెళుతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి అతడి స్వయంకృతాపరాధమే కారణమనే వాళ్లు కూడా ఉన్నారు.