బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు రెడీ అవుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ సందడి చేయనున్నారు. కంటెస్టంట్స్ లిస్ట్ లో స్టార్ సెలబ్రిటీస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ విన్నర్ కావాలంటే సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో తెలిసిందే. సెకండ్ సీజన్ లో కౌశల్ ఆ విధంగానే టైటిల్ గెలుచుకున్నాడు. అయితే కౌశల్ ముందుగానే బయట ఆర్మీ సిద్ధం చేసుకుని హౌజ్ లోకి వచ్చాడన్న టాక్ కూడా ఉంది.
ఇదిలాఉంటే ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతి కంటెస్టంట్ ఇలానే తమని ఫాలో అయ్యేందుకు సెపరేట్ ఆర్మీ సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నారట. ఇలా చేస్తే బిగ్ బాస్ కు కూడా బిగ్ టాస్క్ అన్నట్టే. అందుకే ఈసారి ఓటింగ్ ప్రక్రియను కూడా స్ట్రిక్ట్ గా ఉండేలా చేస్తున్నారట. ఫేక్ ఐడిలతో ఓటింగ్ వేస్తే దాన్ని ఆమోదించరని తెలుస్తుంది. బిగ్ బాస్ సెకండ్ సీజన్ కౌశల్ ఆర్మీ చేసిన హంగామా ఓ విధంగా బిగ్ బాస్ నిర్వాహకులకు హెడేక్ గా మారిందని చెప్పొచ్చు.
అందుకే సీజన్ 3 కంటెస్టంట్స్ కు చాలా రిస్టిక్షన్స్ పెడుతున్నారట. అంతేకాదు ఎంత రియాలిటీ షో అయినా పర్సనల్ గా వెళ్లొద్దని ముఖ్యంగా ఒకరిని ఒకరు దూషించుకోవద్దని బయట ఉన్న మీ ఇమేజ్ కు అది భంగం కలిగిస్తుందని చెబుతున్నారట. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి.