టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు..వస్తూనే ఉన్నారు. అయితే ఇందులో సెట్ అయిన హీరోల్లో కొద్ది మంది ఉంటే..ఇంకా సరైన గుర్తింపు రాని హీరోలు కూడా ఉన్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. మామ బ్యాగ్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.
అందుకే ఆయనను స్టైలిష్ స్టార అని కూడా అంటారు. అల్లు ఫ్యామిలీ నుంచి గౌరవం మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కొత్త జంటతో హిట్ అందుకున్నా మనోడికి ఏమాత్రం కలిసి రాలేదు. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నా ఏమూవీ సినిమా ఈ హీరోకి కలిసి రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ హీరోగా తన జోరు చూపిస్తున్నాడు. అల్లు శిరీష్ కూడా హీరోగా తన ప్రత్యేకతను చూపించే ప్రయత్నాలతో బిజీగా వున్నాడు. అయితే ఈ ఇద్దరికి అన్నయ్య బాబీ ఉన్నాడు.
మొదటి నుంచి నిర్మాణ పరమైన వ్యవహారాలు చూస్తూ వస్తోన్న ఆయనకి, తాజాగా తెరపై కనిపించాలనే ఆసక్తి కలిగిందట. ఈ మూవీలో పెద్దగా హీరోయిన్ంపై కాకుండా తన వయసు కు దగ్గ కీలకమైన, ప్రత్యేకమైన పాత్రలను పోషించాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన తండ్రితో పాటు తనతో సన్నిహితంగా వుండే కొంతమంది దర్శక నిర్మాతల చెవిన కూడా వేశాడని అంటున్నారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీకొ అల్లు కుటుంబం నుంచి ముగ్గురు హీరోలు ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.