‘ మ‌న్మ‌థుడు 2 ‘ బ‌డ్జెట్ ఎంతో తెలుసా…

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. 2002లో వచ్చిన మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఘాటైన రొమాన్స్ గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. జెమినీ కిర‌ణ్ – నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పోస్టర్లు, టీజ‌ర్ల‌తో హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున వయసు ఆరు పదులకు చేరువవుతున్నా తాను గీతాంజలి ఏజ్ కింగ్‌నే అంటూ జోరు చూపిస్తున్నారు.

నాగ్ రొమాన్స్‌లో అప్పటితో పోలిస్తే ఇంకా ప‌దును పెరిగింద‌న్న‌ జోకులు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి మ‌న్మ‌థుడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కు చాలా కలిసి వచ్చాయి. ఇప్పటికే మన్మధుడు 2 శాటిలైట్.. హిందీ డబ్బింగ్ రైట్స్.. డిజిటల్ రూపంలో రూ. 22 కోట్ల మేర నాన్ థియేట్రికల్ బిజినెస్ సాగింది. థియేట్రికల్ కూడా హై రేంజులోనే న‌డుస్తోంది. ఈ సినిమాకు మొత్తం రూ.24 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ట‌.

నాగార్జున పారితోషికం మినహా ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టారట. అయితే ఇప్పటికే ఈ మొత్తం నాన్ థియేట్రికల్ రూపంలోనే ఆర్జించారు. ఇక థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.30 నుంచి రూ.35 కోట్ల వ‌ర‌కు చేయ‌వ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఆగస్టు 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మ‌న్మథుడు 2 పాజిటివ్ బ‌జ్‌తో థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది.

Leave a comment