‘రాక్షసుడు’ టోట‌ల్ ప్రి రిలీజ్‌ బిజినెస్‌… బెల్లంకొండకు బిగ్ టార్గెట్‌

టాలీవుడ్‌లోకి నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్‌కు ఇప్ప‌ట‌కీ స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేదు. తొలి సినిమా అల్లుడుశీను నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన సీత వ‌ర‌కు అన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా ప్లాపులే. భారీ బడ్జెట్‌, పెద్ద ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసినా స‌రైన సినిమా ప‌డ‌లేద‌నే చెప్పాలి.

ఇక గ‌తేడాది చివ‌ర్లో క‌వ‌చం, ఈ యేడాది వ‌చ్చిన సీత సినిమాలు రెండు డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇక ఇప్పుడు బెల్లంకొండ ఆశ‌ల‌న్నీ రాక్ష‌సుడు మీదే ఉన్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాలో హీరోయిన్‌. సైకో క్రైం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ తెర‌కెక్కింది. ఇప్ప‌టికే కోలీవుడ్‌లో హిట్ అవ్వ‌డంతో ఇక్క‌డ మంచి బ‌జ్ ఉంది.

ఈ సినిమా రూ. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందితే అన్ని రకాల బిజినెస్‌ల ద్వారా నిర్మాత ఖాతాలోకి ఏకంగా 35 కోట్ల వరకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బెల్లంకొండ రేంజ్‌కు ఈ బ‌డ్జెట్ ఎక్కువే అని చెప్పాలి. మ‌రి ఈ సినిమా ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ చూద్దాం.

`రాక్ష‌సుడు` టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్: (రూ.కోట్లలో)

నైజాం – 5.5

సీడెడ్ – 2

వైజాగ్ – 1.5

ఈస్ట్ – 0. 95

వెస్ట్ – 0. 85

కృష్ణ – 1.0

గుంటూరు – 1.2

నెల్లూరు – 0. 50

కర్ణాటక – 1.1

రెస్టాఫ్ ఇండియా – 0. 70

ఓవర్సీస్ – 0. 70

శాటిలైట్‌ రైట్స్ – 6.0

హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ మరియు ప్రైమ్‌ వీడియో రైట్స్ – 12.5

ఇతర ఏరియాలు – 0. 50

Leave a comment