Gossipsసమంతకు రష్మిక చెక్ పెట్టబోతుందా?

సమంతకు రష్మిక చెక్ పెట్టబోతుందా?

టాలీవుడ్ లో ‘ఛలో’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమా మంచి హిట్ అందుకుంది..ఆ వెంటనే పరుశరామ్ దర్శకత్వంలో దేవరకొండ విజయ్ హీరోగా వచ్చిన ‘గీతాగోవిందం’సినిమా సెన్సేషన్ హిట్ అందుకుంది..ఏకంగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రష్మికకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఆ మద్య నాగార్జున, నాని నటించిన ‘దేవదాసు’సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా నటిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘డీయర్ కామ్రెడ్’సినిమాలో నటిస్తుంది. కొంత కాలంగా నటి సమంత కూడా వరసు విజయాలు అందుకుంటున్నాన..ఆమె వివాహిత కనుక ఎప్పుడైనా మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడుతున్నారు ఫిలిమ్ వర్గాలు.

ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో మెప్పించిన నటి రష్మిక. పారితోషికం విషయంలో రాజీపడకుండా రష్మిక ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నా మరో సంవత్సరం వరకూ రష్మిక డైరీలో ఒక్కరోజు కూడ ఖాళీ లేకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా తమిళ టాప్ హీరో విజయ్ ఆమెకు ఆఫర్ ఇచ్చినా తన వద్ద డేట్స్ లేకపోవడంతో ఆసినిమాను ఒప్పుకోలేని పరిస్థితిలో రష్మిక ఉన్నట్లు సమాచారం.

తెలుగు ఇండస్ట్రీలో కూడ ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న పరిస్థుతులలో రానున్న రోజులలో రష్మిక సమంత స్థానాన్ని భర్తీ చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news