Gossipsశర్వానంద్ " పడి పడి లేచె మనసు " రివ్యూ &...

శర్వానంద్ ” పడి పడి లేచె మనసు ” రివ్యూ & రేటింగ్

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా పడి పడి లేచె మనసు. సుధార్కర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సూర్య (శర్వానంద్) తన గతం చెబుతుండగా సినిమా మొదలవుతుంది. కలకత్తాలో వైశాలి (సాయి పల్లవి)ని చూడటం ఆమెకు తెలియకుండానే ఆమెని ప్రేమించడం. అది గమనించిన వైశాలి సూర్యని నిలదీస్తుంది. అయినా సరే పట్టువదలని విక్రమార్కునిగా సూర్య వైశాలిని ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇద్దరు ప్రేమించుకునే టైంలో ఓ చిన్న ట్విస్ట్.. సూర్య, వైశాలి విడిపోతారు.. సూర్య, వైశాలి ఎందుకు విడిపోయారు..? దానికి కారణాలేంటి..? అన్నది మిగతా సినిమా కథ.
3
నటీనటుల ప్రతిభ :

సూర్య పాత్రలో శర్వానంద్ అదరగొట్టాడు. తనకు సూటయ్యే పాత్రలో శర్వానంద్ తన నటనతో మెప్పించాడు. ఇక సాయి పల్లవి మరోసారి అదరగొట్టింది. వైశాలి పాత్రలో ఆమె పర్ఫెక్ట్ అనిపించుకుంది. మురళి శర్మ, సుహాసిని పాత్రలు ఆకట్టుకున్నాయి. ప్రియదర్శి, వెన్నెల కిశోర్ పాత్రలు అలరించాయి. నోయెల్, ప్రియా రామన్ పాత్రలు మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

జేకె సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ ను బాగా చూపించారు. ఎమోషన్స్ కూడా బాగా క్యాప్చర్ చేసారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. టైటిల్ సాంగ్ తో పాటుగా మరో రెండు సాంగ్స్ అలరించాయి. బిజిఎం కూడా బాగుంది. దర్శకుడు హను కథ కొత్తగా ఏం లేదు. కథనం పర్వాలేదు అనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
4
విశ్లేషణ :

ప్రేమ కథలు ఎన్నొచ్చినా మనసుని పులకరింపచేసే ప్రేమ కథలు వస్తే మళ్లీ ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేస్తారు. అయితే రొటీన్ కథే అయితే మాత్రం కష్టం. పడి పడి లేచే మనసు సినిమా కూడా అంతే దర్శకుడు హను కథ అంత కొత్తగా ఏం ఉండదు. హీరో, హీరోయిన్ లవ్ తర్వాత ఈగో క్లాషెష్ ఇలాంటి కథే.

అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల హను తన ప్రతిభ కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగుతుంది. అయితే సెకండ్ ఎమోషన్ బాగుంది. అయితే కన్ ఫ్లిక్ట్ గా ఉండటం వల్ల ఆడియెన్స్ కు నచ్చే అవకాశం లేదు. యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే అంచనాలకు తగినంత లేదన్నది వాస్తవం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

సాయి పల్లవి

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ లవ్ స్టోరీ

సినిమాటిక్ ట్రీట్మెంట్

బాటం లైన్ :

పడి పడి లేచె మనసు.. హను మరోసారి నిరాశ పరచాడు..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news