Gossipsమహిళా జర్నలిస్ట్ ని రేప్ చేసిన కేంద్రమంత్రి

మహిళా జర్నలిస్ట్ ని రేప్ చేసిన కేంద్రమంత్రి

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌పై అమెరికాలో స్థిరపడిన పల్లవి గొగొయ్ అనే మహిళ మీటూలో భాగంగా లైంగిక ఆరోపణలు చేశారు. వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఓ కథనంలో అక్బర్ తనను రేప్ చేశారని వెల్లడించారు. పల్లవి తనపై అత్యాచార ఆరోపణలు చేయడాన్ని ఎంజే అక్బర్ తీవ్రంగా ఖండించారు. ఆమెవన్నీ నిరాధార ఆరోపణలే అని కొట్టి పారేశారు. అయితే తమ మధ్య బంధం ఉన్న విషయాన్ని మాత్రం ఆయన అంగీకరించారు.

అయితే … వాషింగ్టన్ పోస్ట్ కు రాసిన సుదీర్ఘమైన లేఖలో ఈ మహిళా జర్నలిస్ట్ తన ఆవేదన మొత్తం బయటపెట్టారు. మీ-టు ఉద్యమం వల్ల ఇన్నాళ్లకు తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని అంటూ వారిద్దరి మధ్య జరిగిన వ్యవహారాన్ని ఆమె బయటపెట్టింది.

ఢిల్లీలో ఏషియన్ ఏజ్ సంస్థ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె వివరించారు. 1994లో ఒక రోజు తాను ఒపీనియన్ ఎడిటోరియల్ పేజ్‌కు రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్‌లైన్‌ను చూపించేందుకు అక్బర్‌ దగ్గరకు వెళ్లానని.. ఆ హెడ్‌లైన్‌ను మెచ్చుకుంటూ హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నారని చెప్పారు.

ఓ మేగజైన్ ప్రారంభోత్సవానికి ముంబై వెళ్లినప్పుడు హోటల్‌ గదిలోనూ మరోసారి లైంగిక దాడికి అక్బర్ ప్రయత్నించాడని ఆమె వివరించారు. మరోసారి జైపూర్‌లో అసైన్‌మెంట్‌ ఉందని తీసుకెళ్లాడని.. ఆ సమయంలో మాత్రం తాను అక్బర్ బారి నుంచి తప్పించుకోలేకపోయానని వివరించారు. హోటల్ గదిలోకి పిలిచి అత్యాచారం చేశాడని , ఎంతగా ప్రతిఘటించినా అతడి బలం ముందు నిలువలేకపోయానన్నారు. బట్టలు చించి తనను రేప్‌ చేశాడని చెప్పారామె.

అయితే ఈ విషయాలపై అక్బర్ స్పందిస్తూ… ‘1994లో పల్లవికి, నాకు మధ్య సంబంధం ఉండేది. అది కొన్ని నెలల పాటు కొనసాగింది. అయితే.. ఈ బంధం నా ఇంట్లో కలతలకు కారణమైంది. దీంతో మా మధ్య సంబంధం అర్ధంతరంగా ముగిసింది. ఈ బంధానికి ఒక మంచి ముగింపు మాత్రం ఇవ్వలేకపోయాం’ అని అక్బర్ చెబుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news