అదిరిపోయే ట్విస్ట్.. RRRలో ఎన్టీఆర్,చరణ్ తో పాటు ప్రభాస్..

రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ ట్రిపుల్ ఆ ముహుర్తం ఈ నెల 11న ఫిక్స్ చేశారని తెలిసిందే. 11వ తారీఖు ఉదయం 11 గంటలకు ట్రిపుల్ ఆర్ మొదలు పెట్టనున్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ లతో పాటుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా లాంచింగ్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ కు అమరేంద్ర బాహుబలి అదేనండి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని తెలుస్తుంది. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్నాడు. చరణ్, ఎన్.టి.ఆర్ లతో క్లోజ్ గా ఉండే ప్రభాస్ వారి సినిమా ఓపెనింగ్ కు వచ్చి అలరించనున్నాడు.

ట్రిపుల్ ఆర్ కోసం ప్రభాస్ గెస్ట్ గా మారబోతున్నాడన్నమాట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. 2020 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment