” 2.0 – ఆఫీషియల్ ట్రైలర్ “..దుమ్మురేపుతున్న అక్షయ్ కుమార్, రజినీకాంత్..

వైవిద్యమైన కథాంశాలతో చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్షకులు ఊహకందని రీతిలో తన దర్శకత్వం మెలకువలను ఉపయోగించి భారీ హిట్లు కొట్టే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరోసారి భారీ హిట్ కొట్టేందుకు రోబో టు పాయింట్ జీరో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారు 500 కోట్లతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈరోజు ఈ చిత్రాన్ని సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

ఇక్కడ కూడా శంకర్ తను వైవిధ్యాన్ని ప్రదర్శించారు 3డి టెక్నాలజీ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు భారీ సంఖ్యలో ఈ ట్రైలర్ విడుదల కు జనాలు హాజరవుతున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్‌లో 2.0 రూపొందించారు.

ట్రైలర్ రిలీజ్ వేడుకకు రజనీ, శంకర్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భార్య లతతో రజనీ రాగా, శంకర్ తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో వేదిక వద్దకు వచ్చారు. అక్షయ్ కుమార్ రాకతో వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాలో గ్రాఫిక్ కు పెద్ద పీట వేశారు. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా రజనీ, శంకర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ శంకర్ చెరిత్రలోనే ఒక మైలురాయి కింద ఈ ట్రయిలర్ నిలిచిపోతుంది.ఈ ట్రైలర్ చూస్తుంటే సినీ చెరిత్రలో నిలిచిపోయే సినిమా శంకర్ తీసాడని అర్ధమవుతుంది.చూదాం ఈ సినిమా ఎంతవరుకు అభిమానుల ఆదరణ పొందుతుందో.

Leave a comment