Gossipsషకలక శంకర్ సినిమా ఆపేశారు..!

షకలక శంకర్ సినిమా ఆపేశారు..!

జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన షకలక శంకర్ సినిమాల్లో కూడా కమెడియన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు అతను హీరోగా చేసిన సినిమా శంభో శంకర. శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా కన్నా ముందే షకలక శంకర్ ఓ సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమానే డ్రైవర్ రాముడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా భలే అనిపించింది. కాని ఆ సినిమా ఆగిపోయిందని చెప్పాడు శంకర్. టీజర్ తో అందరికి షాక్ ఇచ్చిన షకలక శంకర్ ఆ సినిమా ఆపేసినట్టు చెప్పాడు. అయితే ఆ టీజర్ విషయంలో షకలక శంకర్ ను కొందరు నందమూరి అభిమానులు విమర్శలు కూడా చేశారు. అది పక్కన పెడితే శంభో శంకర మాత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటున్నాడు శంకర్.

ఈ సినిమా టైంలోనే ఈ కథ పట్టుకుని దిల్ రాజు, రవితేజ, త్రివిక్రం వంటి వారి దగ్గరకు వెళ్లాడు షకలక శంకర్ కాని వారెవరు తగిన ప్రోత్సాహం అందించలేదని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news