Newsఎట్టకేలకు సమంత-చైతుల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్.. పిలిచింది వీళ్లనే!

ఎట్టకేలకు సమంత-చైతుల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్.. పిలిచింది వీళ్లనే!

Finally, Akkineni family fixed the egagement date of love birds Naga Chaitanya and Samantha.

చాలాకాలం నుంచి సమంత, నాగచైతన్యల మధ్య ప్రేమాయణం నడుస్తోంది.. ఇద్దరూ విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నారు.. కానీ పెళ్ళి మాట ఎత్తలేదు. మరోవైపు.. చైతూ కంటే చిన్నవాడైనా నిఖిల్ నిశ్చితార్థం శ్రియా భూపాల్‌తో జరిగిపోయింది. దీంతో ఖంగుతిన్న సినీజనాలు.. అసలు చైతూ-శ్యామ్‌ల వ్యవహారం ఏమైంది? అనే సందేహం వ్యక్తమైంది. దీనికి చెక్ పెడుతూ.. తాజాగా నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఇన్నాళ్లూ మిస్టరీగానే ఉంచిన ఈ విషయాన్ని.. ఇప్పుడు రివీల్ చేసింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చైతూ-శ్యామ్‌ల నిశ్చితార్థం జనవరి 29వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకి కొందరు అతిథులను కూడా ఆహ్వానించారట. ఈ ఫంక్షన్‌కి ఘనంగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. అఖిల్ నిశ్చితార్థంలాగే ఈ వేడుకని చాలా సీక్రెట్‌గా చేస్తారా? లేదా? అన్నదే సస్పెన్స్‌గా మిగిలింది. ఏదేమైనా.. చైశ్యామ్‌ల నిశ్చితార్థం తేదీని ఖరారు చేయడంతోపాటు వారిరువురి ఫ్యాన్స్ సందడి చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. అఖిల్ కంటే చైతూ పెళ్ళి ముందు జరుగుతుందా? లేదా ఒకేసారి అవుతుందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినీజనాలు. దీనికి సమాధానం దొరకాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news