Newsవర్మ హీరోయిన్‌పై కుక్కలదాడి.. ఆ దారుణం ఎలా జరిగిందంటే?

వర్మ హీరోయిన్‌పై కుక్కలదాడి.. ఆ దారుణం ఎలా జరిగిందంటే?

Killing Veerappan actress Parul Yadav attacked by street dogs in Mumbai when she went along with her pet dog.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించిన హీరోయిన్ పారుల్ యాదవ్‌కి సోమవారం సాయంత్రం చేదు అనుభవం ఎదురైంది. కాసేపు సేదతీరుదామని తన కుక్కతో కలిసి బయటికి వెళ్తే.. అనుకోని పరాభావం చవిచూసింది. వీధి కుక్కల దాడికి ఆసుపత్రి పాలైంది.

ముంబైలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. తన అపార్ట్‌మెంట్ సమీపంలోని ఓ ప్రశాంతమైన ప్రాంతంలో పారుల్ పెంపుడు కుక్కతో నడుస్తూ వెళ్తోంది. ఇంతలో అక్కడికి ఆరు వీధి కుక్కలు వచ్చాయి. అవి పారుల్ పెంపుడు కుక్కపై విరుచుకుపడగా.. దాన్ని కాపాడే క్రమంలో ఆ కుక్కలు ఆమెపై దాడి చేశాయి. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైన ఆమెని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. తలపై మూడు సెంటీమీటర్లలోతు గాటు పడిందని, ఆమెకు సర్జరీ చేశారని తెలిపారు.

కాగా.. కన్నడ పరిశ్రమలో హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె అక్కడ బాగా పాపులర్ అయిన నటి. ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. అనుకోకుండా కుక్కల దాడితో గాయపడడంతో కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వనుంది. బాలీవుడ్ ‘క్వీన్‌’ కన్నడ రీమేక్‌లో ఈమెని కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news