News‘ఆ’ వ్యాపారంలోకి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

‘ఆ’ వ్యాపారంలోకి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

Tollywood heroine Anushka Shetty making plan to enter in business by building a star hotel for movie events and other private ceremonies.

సినీ పరిశ్రమలో మంచి పొజిషన్‌లో ఉన్నవారు ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వివిధ వ్యాపార రంగాల్లో అడుగిడుతున్నారు. ముఖ్యంగా.. స్టార్ స్టేటస్‌లో ఉన్నవారే ఇలా ఇతర దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా చేరిపోయింది. పెద్ద సినిమాలు చేస్తూ భారీ పారితోషికాలు అందుకుంటున్న ఈ అమ్మడు.. ఇకపై పర్సనల్ లైఫ్‌లో సెట్ అవుదామనే ఉద్దేశంతో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అమ్మడు ఓ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకుందట.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అనుష్క ఒక స్టార్ హోటల్ నిర్మించాలనే ప్లాన్ చేస్తోందట. బాగా ఆలోచించి ఈ అమ్మడు ఆ నిర్ణయం తీసుకుందట. వీలైనంత త్వరగా ఓ బ్రహ్మాండమైన హోటల్ నిర్మించి.. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఈవెంట్స్, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించుకునే వీలుగా ఆ హోటల్ ఉంటుందని.. అలాగే బస చేసే గదులు కూడా ఉండేలా అనుష్క ఓ ప్రణాళిక రచించిందట. ఇందుకు ఒక ప్రత్యేక స్టాఫ్ కూడా ఏర్పాటు చేసుకుందని, త్వరలోనే పూర్తి ప్లాన్ రెడీ చేసుకుని రంగంలోకి దిగాలని ఆ అమ్మడు యోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.

అంతేకాదు.. కుదిరితే జిమ్ సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని అనుష్క అనుకుంటోందట. త్వరలోనే ఈ వివరాలన్నీ అధికారికంగా వెలువడి కానున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. స్టార్ హీరోయిన్‌లాగే సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా అనుష్క ఎదగనుందనమాట.

Anushka-Hotel-Business-1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news