613.. ఇంతటితో ‘బాహుబలి’ శకం సమాప్తం!

baahubali the conclusion shooting complete

Finally, Baahubali The Conclusion movie shooting completed. SS Rajamouli officially announced this via social media.

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’ శకం ఈరోజు (06-01-2017)తో ముగిసింది. అవును.. మొదటి భాగంతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న.. రెండోభాగం (కన్‌క్లూజన్)ని ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా? అని వేచిచూస్తున్న సినీజనాలకు ఈ శుభవార్తను స్వయంగా జక్కన్ననే ట్విటర్ వేదికగా తెలిపాడు.

‘ప్రభాస్‌తో షూటింగ్ పూర్తయిపోయింది. సుదీర్ఘకాలం ప్రయాణం చేశాం. థ్యాంక్స్ డార్లింగ్.. ఈ ప్రాజెక్టుని నువ్వు నమ్మినంతగా వేరెవ్వరూ నమ్మకం ఉంచలేదు. అదే అన్నికంటే విలువైనది’ అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. ఈ మూవీలో ఉన్న ఇతర నటీనటులు వేరే ప్రాజెక్టులు చేసుకుంటూనే.. దీనికి సమయం కేటాయించారు. కానీ.. ప్రభాస్ ఒక్కడే ఏ ఇతర ప్రాజెక్టులు ఒప్పుకోకుండా ‘బాహుబలి’కే అంకితమైపోయాడు. అందుకే.. అతణ్ణి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ జక్కన్న థ్యాంక్స్ చెప్పాడు.

నిజానికి.. రెండో భాగం షూటింగ్ తొలుత అక్టోబర్‌లోనే కంప్లీట్ అవుతుందని యూనిట్ ప్రకటించింది. కానీ.. వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్‌లో మొదట్లో కంప్లీట్ చేసేలా చిత్రబృందం ప్లాన్ చేసింది కానీ.. అలా జరగలేదు. ఏదైతేనేం.. ఇప్పుడు ముగియడంతో ఈ మూవీ ప్రియులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొదటి భాగంతోపాటు రెండో భాగం చిత్రీకరణ కోసం మొత్తం 613 రోజులు సమయాన్ని చిత్రబృందం కేటాయించింది.

ఈరోజుతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. టీజర్, ట్రైలర్ల కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అవి ఎప్పుడు విడుదల అవుతాయో చిత్రబృందం వెల్లడించే వరకు నిరీక్షణ తప్పదు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment