చిరంజీవికి ఇచ్చినట్లుగా మహేష్‌కి పూరీ జగన్నాథ్ కౌంటర్..?

puri jagannadh counter mahesh babu venkatesh janaganamana

Puri Jagannadh makes a master plan to give counter to Mahesh Babu with Victory Venkatesh by doing Janaganamana movie.

మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘పోకిరి’తో ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన ఈ జోడి.. ఆ తర్వాత ‘బిజినెస్‌మేన్’తోనూ సత్తా చాటింది. దీంతో.. ఈ జోడికి తెలుగు చిత్రపరిశ్రమలో అదోరకమైన క్రేజ్ నెలకొంది. అలాంటి వీరిమధ్య ఇప్పుడు విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో.. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చినట్లుగానే మహేష్‌కి ఓ భారీ కౌంటర్ ఇచ్చేందుకు పూరీ రంగం సిద్ధం చేసుకున్నాడని సమాచారం.

తన 150వ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నానని చిరంజీవి ప్రకటించిన కొత్తలో.. పూరీ జగన్నాథ్ రంగంలోకి దిగాడు. చిరు, పూరీ మధ్య కొన్నాళ్లు చర్చలు కూడా జరిగాయి. ఒకానొక సమయంలో చిరు ప్రతిష్టాత్మక సినిమాకి పూరీనే ఫిక్స్ అవుతాడని అనుకున్నారు. కానీ.. వివి వినాయక్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇలా తనని సడెన్‌గా కాదన్నందుకు.. చిరుకి కౌంటర్ ఇవ్వాలని కళ్యాణ్ రామ్‌తో ‘ఇజం’ మూవీ చేశాడు. సేమ్ అలాగే.. మహేష్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని పూరీ ప్లాన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అసలు మహేష్‌కి పూరీ కౌంటర్ ఇవ్వడమేంటి? వీరిద్దరి మధ్య అంతగా ఏం చెడింది? అనేగా మీ సందేహం..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

మహేష్‌తో ‘జనగణమన’ చేస్తున్నట్లు ఆమధ్య పూరీ ట్వీట్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మహేష్ కూడా ఈ మూవీ చేసేందుకు ఆసక్తి చూపాడు. ఇంతలో ఏమైందో తెలీదు కానీ.. ‘ఇజం’ మూవీ ప్రమోషన్స్‌లో మహేష్ తీరుపట్ల పూరీ ఓ రకమైన అసహనం వ్యక్తం చేశాడు. ‘కథ చెప్పాను.. చేద్దామన్నాడు.. ఆ తర్వాత మళ్ళీ స్పందించలేదు’ అని పూరీ అన్నాడు. అంతేకాదు.. తాను ఏ హీరో కోసం వెయిట్ చేయనని, మైండ్‌లో ఫిక్స్ అయితే ఏ హీరోతోనైనా మూవీ చేయాలని బ్లైండ్‌గా ఫిక్స్ అవుతానని అన్నాడు. అలా అన్నట్లుగానే.. మహేష్‌తో తాను తీయాలనుకున్న ‘జనగణమన’ మూవీని మరో హీరోతో పూరీ చేయబోతున్నాడు.

ఆ హీరో మరెవ్వరో కాదు.. విక్టరీ వెంకటేష్. అవును.. ఈమధ్యే పూరీ-వెంకీ కాంబోలో ఓ మూవీ ఓకే అయిన విషయం విదితమే. వీరి కాంబోలో తెరకెక్కబోయే ఆ సినిమా ‘జనగణమన’నే అన్నది తాజా కబురు. మహేష్ హ్యాండ్ ఇవ్వడంతో.. అతనికి కౌంటర్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో వెంకీతో ఆ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట పూరీ. త్వరలోనే దీన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు స్కెచ్ కూడా గీసుకున్నాడు. ఈ మూవీని వెంకీ, అతని అన్నయ్య సురేష్ బాబు సంయుక్తంగా రూ.45 కోట్లతో నిర్మిస్తున్నారు.

Leave a comment