Moviesరామ్ చరణ్ ‘ధృవ’ సినిమా నాలుగు వారాల కలెక్షన్స్ వివరాలు

రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా నాలుగు వారాల కలెక్షన్స్ వివరాలు

Ram Charan Tej’s latest movie Dhruva 28 days collections were registered 41.09cr share in Andhra Pradesh and Telangana.

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధృవ’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ట్రేడ్ నిపుణులు ఈ మూవీకి సంబంధించిన నాలుగు వారాల కలెక్షన్స్ వివరాల్ని వెల్లడించారు. వారి లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం 28 రోజుల్లో రూ.41.09 కోట్లు కలెక్ట్ చేసింది.

జనవరి 1వ తేదీ తర్వాత డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేకపోవడంతో.. ఈ చిత్రం డీసెంట్ వసూళ్లతో దూసుకెళుతోంది. పైగా.. విడుదలైన ఇతర చిత్రాలకి యావరేజ్ టాక్ రావడంతో ‘ధృవ’కి బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీకెండ్‌లో ఏ ఇతర సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ‘ధృవ’ హవానే నడుస్తుంది. ఏరియాలవారీగా నాలుగు వారాల్లో ఈ చిత్రం కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. (కోట్లలో)

నైజాం : 15.32
సీడెడ్ : 6.70
ఉత్తరాంధ్ర : 5.36
ఈస్ట్ గోదావరి : 3.16
వెస్ట్ గోదావరి : 2.75
కృష్ణా : 2.96
గుంటూరు : 3.50
నెల్లూరు : 1.34
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 41.09 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news