Moviesరామ్ చరణ్, సుకుమార్ ల "రంగస్థలం" రివ్యూ & రేటింగ్

రామ్ చరణ్, సుకుమార్ ల “రంగస్థలం” రివ్యూ & రేటింగ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మొరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూసేద్దాం.

కథ :

రంగస్థలం అనే ఊరు.. ఊళ్లి అందరికి ఎలాంటి అవసరం వచ్చినా చేసి పెట్టే చిట్టి బాబు (రాం చరణ్). చెవిటి వాడే అయినా అవతల వాళ్లు పెదాల కదలికను బట్టి మ్యాటర్ అర్ధం చేసుకుంటాడు. ఇక ఊరంటే సంతోషం ఎలా ఉంటుందో బాధ అలానే ఉంటుంది. ముఖ్యంగా ఊరు రాజకీయాలను శాసించాలని నిర్ణయించుకున్న కుమార్ బాబు (ఆది)కి చిట్టి బాబు సపోర్ట్ గా నిలుస్తాడు. ప్రెసిడెంట్ గా ఉన్న జగపతిబాబును గద్దె దించే ప్రయత్నం చేస్తారు. చిట్టిబాబుకి కుమార్ బాబుకి గొడవలు అవుతాయి. ఇంతకీ కుమార్ బాబు గెలిచాడా..? అతను గెలిచాక అతను ఏం చేశాడు..? చిట్టి బాబుకి కుమార్ బాబు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి..? అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమా మొత్తం రాం చరణ్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్ హీరో అయ్యుండి చెవిటి వానిగా నటించడం గట్స్ కు మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ లోని నటుడిని పరిచయం చేస్తాడు సుకుమార్. క్లైమాక్స్ లో చరణ్ నటనకు సర్ ప్రైజ్ అవ్వక తప్పదు. ఇక రామలక్ష్మిగా సమంత ఓకే అనిపించుకుంది. కుమార్ బాబుగా ఆది మరోసారి మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబులు తమ వర్సటైల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు. ఇక యాంకర్ అనసూయ రంగమ్మత్తగా మరోసారి మార్కులు కొట్టేసింది.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమా ఇంత బాగా వచ్చింది అంటే 1985 కాలం నాటి సెట్స్ వేసిన ఆర్ట్ డైరక్టర్ గొప్పతనం గురించి పొగడాల్సిందే. ప్రతి సన్నివేశం అందంగా తీర్చిదిద్దారు. ఇక దేవి మ్యూజిక్ కూడా సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. పాటలన్ని ప్రేక్షకాదరణ పొందినవే. పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా సినిమాకు ప్రాణం పెట్టేశాడు. కచ్చితంగా రత్నవేలు కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా అవుతుంది. అయితే సినిమా రన్ టైం 179 నిమిషాలు. ఎడిటర్ ఇంకాస్త తన కత్తెరకి పనిచెబితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అని చెప్పొచ్చు.

విశ్లేషణ :

సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం మొదటి నుండి క్రేజీగానే మారింది. మెగాస్టార్ తనయుడితో సుక్కు మూవీ అంటే అంచనాలు ఏర్పడ్డాయ్. 1985నాటి కథ.. స్వచ్చమైన మన్షుల మధ్య ఓ స్వార్ధం కలిగిన వ్యక్తి మంచిగా నటిస్తూ ఎలా ప్రజలను మోసం చేయాలని చూశాడు. దానికి మన హీరో చిట్టిబాబు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అన్నది కథ.

అయితే మెయిన్ ప్లాట్ కాస్త రొటీన్ గా అనిపించినా సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చరణ్ నటన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. చరణ్ ను ఇలా సుకుమార్ ఎలా ఊహించుకున్నాడో కాని దానికి మాత్రం 100 పర్సెంట్ న్యాయం చేశాడు. ఇక సినిమాలో డ్రామా ఎక్కువగా నడుస్తుందని చెప్పొచ్చు.

మొదటి భాగం అంతా స్పీడ్ గా లాగించేసినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎలక్షన్స్ సీన్స్ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక సినిమా నిడివి కూడా 3 గంటలు అవసరం లేదనిపిస్తుంది. కథను ఎంగేజ్ చేసే క్రమంలో సినిమా డ్యూరేషన్ గురించి సుకుమార్ మర్చిపోయాడని చెప్పొచ్చు.

కథ, కథనాలు కాస్త రిఫ్రెష్ మెంట్ గా అనిపించినా అక్కడక్కడ ఓవర్ సెంటిమెంట్ అనిపిస్తుంది. ఫైనల్ గా చరణ్ కోసం మాత్రం రంగస్థలం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

చరణ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

సుకుమార్ టేకింగ్

మైనస్ పాయింట్స్ :

రన్ టైం

సెంటిమెంట్

బాటం లైన్ :రంగస్థలం.. రాం చరణ్ నట విశ్వరూపం..!

రేటింగ్ : 3.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news