ఈ ఏడాది టాలీవుడ్లో డిజాస్టర్లు చాలానే వచ్చాయి. రావణాసుర – ఏజెంట్ – రామబాణం – కస్టడీ – స్పై – ఆది పురుష్ – రంగబలి – బ్రో – భోళాశంకర్ – గాండీవ ధారి అర్జున ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు కూడా ఉంటాయి. ఈ డిజాస్టర్ల సంగతి వేరు. భోళా శంకర్ – గాంఢీవ ధారి సినిమాల సంగతి వేరు. ముందుగా భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి చెబితే టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.
అతడు డైరెక్ట్ చేసిన కంత్రి – శక్తి – షాడో – భోళాశంకర్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లు. ఈ సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ నిండా మునిగిపోయి.. కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ కోలుకున్న చాలా టైం పడుతుంది. వరుస ప్లాపులు వస్తున్నా ఈ డైరెక్టర్ ను నమ్మి స్టార్ హీరోలతో సినిమా తీసి కోట్లు నష్టపోతున్నా.. మళ్లీ ఏదో ఒక నిర్మాత ఈ డైరెక్టర్ బుట్టలో పడిపోతున్నారు. షాడో తర్వాత 10 సంవత్సరాల పాటు మెహర్ రమేష్ ను ఇండస్ట్రీ అంతా దూరం పెట్టేసింది.
అయితే బంధుత్వం పేరుతో చిరంజీవి ఆయన్ను దగ్గరకు తీసి తర్వాత అనిల్ సుంకరను నిండా ముంచేశారు. అసలు ఈ సినిమాపై ముందు నుంచి ఎవరికీ అంచనాలు లేవు. పదేళ్లపాటు ఇండస్ట్రీకి మెహర్ రమేష్ ను దూరం పెట్టిన వారంతా ఇకపై శాశ్వతంగా దూరం పెడితే మంచిదేమో అనుకోవాలి. ఇక ప్రవీణ్ సత్తార్ విషయానికి వస్తే మెహర్ రమేష్ తో ఆయన్ని పోల్చలేం.. మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తేనే ఆయనలో టాలెంట్ ఉందని అర్థమవుతుంది. ఎల్బీడబ్ల్యూ – రొటీన్ లవ్ స్టోరీ – చందమామ కథలు – గుంటూర్ టాకీస్ – పిఎస్వి గరుడ వేగ –
గాండీవదారి అర్జున సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సినిమాల్లో కథా బలమో లేదా కాస్త వైవిధ్యంగా ఉండడమో జరుగుతుంది. అన్నింటికి మించి మెహర్ రమేష్‌లా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించి నిర్మాతలను నిండా ముంచేసే మనిషి అయితే కాదు.
అయితే గాండీవ ధారి అర్జున విషయంలో కథ డిఫరెంట్‌గా ఉన్నా.. కథనం సరిగా లేదు… బడ్జెట్ కాస్త లిమిట్ దాటినట్టు కనిపించింది. తన తర్వాత సినిమా విషయంలో అయినా ప్రవీణ్ జాగ్రత్తలు తీసుకోకపోతే అతడి కెరీర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రవీణ్‌కు ఛాన్సులకు కొదవ ఉండదు.. ఇక మెహర్‌ను మాత్రం పైన చెప్పుకున్నట్టు శాశ్వతంగా మర్చిపోవడమే బెటర్..!