సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ రష్మిక మందన్నా హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా మారింది . కాగా రీసెంట్ గా అమ్మడు మరొక ఆఫర్ ని సైతం తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైంలో అమ్మడు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి కారణం ఆ తెలుగు స్టార్ హీరో అంటూ బయట పెట్టింది .
రష్మిక మాట్లాడుతూ..” నేను ఇంటర్ పూర్తి చేసుకున్నా తరువాత డిగ్రీ కోసం బెంగళూరుకు వెళ్లాను .. అప్పుడే ఎమ్మెస్ రామయ్య కాలేజీ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో చేరాను. కాగా ఓ రోజు ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 2014 బెంగళూరును నిర్వహించారు. అయితే నేను అందులో చదువుకుంటున్న టైంలో మేడం నాకు తెలియకుండా నా పేరు ఇచ్చేసింది ఎందుకు మేడం అలా ఇచ్చారు అంటే ఏం కాదు నీకు సాధ్యమవుతుంది అంటూ నన్ను కన్విన్స్ చేసి పార్టిసిపేట్ చేయించింది. కాగా నేను కాలేజీ లెవెల్ లోనే కాకుండా సెమీఫైనల్స్ లో కూడా సెలెక్ట్ అయ్యాను”.
” అలా ఫైనాల్స్ కోసం ముంబై వెళ్ళినప్పుడు రానా దగ్గుబాటి అక్షయ్ కుమార్ గారు వచ్చారు. ఈ కాంపిటీషన్లో 2014 గా నన్ను ఎంపిక చేశారు. అస్సలు నేను నమ్మలేకపోయాను ఆ తర్వాత కాలేజీకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చిన నెంబర్ తీసుకున్నారట. అలాగే ఒక సంవత్సరంలో నా పేరు కర్ణాటక మొత్తం వైరల్ అయింది. దానితో కిరాక్ పార్టీ సినిమాలో ఛాన్స్ వచ్చింది . కాగ ఈ సినిమాలో బెలకడు అనే పాటలో నన్ను చూసి వెంకటేష్ ఈ అమ్మాయి తెలుగులో నటిస్తే బాగుంటుంది అంటూ నా పేరుని డైరెక్టర్ కి సజెస్ట్ చేశారట. అలా నాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి “అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!