టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రో సినిమా విషయంలో వచ్చిన కాంట్రవర్సీపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఇక పవన్ రాజకీయ విషయంపై కూడా పవన్ కు సపోర్టుగానే ఆమె మాట్లాడారు.
ఇదిలా ఉంటే తాజాగా తన కొడుకు అకీరానందన్ ప్రస్తుతం ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ పవర్ స్టార్ అకీరా అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారం గట్టిగా జరుగుతుండడంతో అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం అకీరా నటన పట్ల అంత ఆసక్తిగా ఏమీ లేడు.. ఒకవేళ తనకి నటన పట్ల ఆసక్తి ఉండి ఉంటే సినిమాలు చేస్తాను అని చెబితే మొట్టమొదట నేనే మీ అందరితో ఈ విషయాన్ని పంచుకుంటాను.. ప్రస్తుతం ఇలాంటి కామెంట్లు చేయవద్దు అని రేణు తన ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అయితే తమ అన్న కొడుకు సినిమా ఎంట్రీ తన ఇష్టం అని చెప్పడానికి రేణు దేశాయ్ ఎవరు ? అకీరా సినిమాల్లోకి రావాలంటే అది తమ అన్న పవన్ ఇష్టం.. ఆయన డెసిషన్‌తో సంబంధం లేకుండా రేణు మాత్రమే ఎలా నిర్ణయిస్తుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఆమె పోస్టుకు యాంటీగా, కౌంటర్‌గా కామెంట్లు చేస్తున్నారు.