Moviesరియల్ లైఫ్ విషయాని రీల్ లైఫ్ లో ఓపెన్ గా చెప్పేసిన...

రియల్ లైఫ్ విషయాని రీల్ లైఫ్ లో ఓపెన్ గా చెప్పేసిన అనుష్క.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రైలర్ లో ఇది గమనించారా(వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ అనుష్క శెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి . సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. అందరు కడుపుబ్బ నవ్వుకునే విధంగా టరిలర్ కట్ చేసాడు డైరెక్టర్ .

ఈ క్రమంలోనే అనుష్క శెట్టి ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది . కాగా ఈ సినిమాలో అనుష్క శెట్టి కి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు ..పెళ్లి ప్రేమ దోమ ఇలాంటివి అస్సలు నమ్మదు . కానీ తల్లి కావాలనుకుంటుంది . అది ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇలాంటి క్రమంలోని స్టాండ్ అప్ కమెడియన్ చేసే నవీన్ తో ఆమె తల్లి కావాలనుకుంటుంది . అయితే అతగాడికి అనుష్క శెట్టి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. పెళ్ళి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోదు.

ఈ క్రమంలో వాళ్ల మధ్య వచ్చే కామెడీ జనాలకు తెగ నచ్చేసింది . మరి ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి టైమింగ్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి . అంతే కాదు కొన్ని కొన్ని సార్లు బోల్డ్ డైలాగ్స్ తో కూడా అనుష్క బాగా మాట్లాడింది. మొత్తానికి ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఫన్నీగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ చిన్న ట్రైలర్తో అర్థం అయిపోతుంది. అంతేకాదు అసలు అనుష్క ఎందుకు పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునింది అనేది మంచి థీమ్ లైన్ తో తీసుకొచ్చాడు డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో..? అయితే ఈ సినిమాలోలాగే నిజ జీవితంలోంకూడా అనుష్కకు పెళ్లి ఇష్టం లేదా..? అందుకే పేభాస్ ని దూరం పెడుతుందా..? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం సెప్టెంబర్ 8వ తేదీ ఈ సినిమా ఏ విధమైన టాక్ సొంతం చేసుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news