సాధారణంగా సినిమాలు ఎప్పుడు ఎలా ? హిట్ అవుతూ ఉంటాయో ఎవరు నమ్మలేరు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఎలా ఉన్నా ? సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అదిరిపోవాలి.. అలా ఉన్న సినిమాలు చాలా హిట్ అవుతూ ఉంటాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్లైమాక్స్‌లో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చే సన్నివేశంలో ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేశాడు.
చాలా సినిమాలు ఫస్ట్ ఆఫ్ లో మామూలుగా ఉండి.. సెకండాఫ్ బాగుంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టు ఎక్కేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగున్నా సినిమా క్లైమాక్స్ సెట్ కాకపోవటంతో ప్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. వివి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్.
భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సూపర్ గా ఉన్న క్లైమాక్స్ లో హీరో వాళ్ళ అమ్మ మొహం చూడకుండా మరణిస్తుంది. కనీసం తల్లిని చివరి చూపు చూడకుండా మిగిలిపోయిన హీరో కథగా ఈ మూవీ ఉండటం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా క్లైమాక్స్ మార్చి ఉంటే కచ్చితంగా యోగి సూపర్ హిట్ అయ్యేది.
ఇక ప్రభాస్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏక్ నిరంజన్. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. అయితే క్లైమాక్స్ సినిమా కొంప ముంచేసింది. చివరలో వాళ్ళ ఫ్యామిలీని కలపకుండా డైరెక్టర్ పెట్టిన టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.. అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ఇలా కేవలం క్లైమాక్స్ సరిగా లేక ప్రభాస్ నటించిన ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. లేకపోతే ప్రభాస్ కెరియర్ లో మరో మరో రెండు హిట్ సినిమాలు పడి ఉండేవి.