టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ ఆమె పేరు జపిస్తూ వస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు వాళ్ళ అమ్మగారు ఓ క్రేజీ కండిషన్ పెట్టిందట .
ప్రజెంట్ అదే న్యూస్ వైరల్ గా మారింది . వాళ్ల అమ్మగారు ఓ గైనకాలజిస్ట్.. చాలా బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు . అయితే శ్రీలీల అమ్మ గారికి హీరో నాగార్జున అంటే చాలా చాలా ఇష్టమట . ఎంత అంటే ఇప్పటికి ఆయనని ప్రేమిస్తూనే ఉంటుందట . అందుకే ఆయనతో రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే చచ్చిన చేయకూడదు ఆయనతో రొమాన్స్ చేయను అంటేనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వెళ్ళు.. లేదంటే లేదు అంటూ చెప్పుకు వచ్చిందట .
దీంతో శ్రీలీల ఆ కండిషన్‌కు యాక్సెప్ట్ చేసి మరి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చింది . ఒకవేళ భవిష్యత్తులో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చిన శ్రీ లీల కూతురు గానో లేకపోతే ఏ గెస్ట్ రోల్ గానో చేస్తుంది తప్పిస్తే..ఎక్కడ రొమాన్స్ చేసే పద్ధతిలో మాత్రం కనిపించదు..!!