కింగ్ ఆఫ్ కోత సినిమాతో ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధంగా ఉంది యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఐశ్వర్య లక్ష్మి హీరో దుల్కర్ సల్మాన్‌తో తనకున్న బంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వీరిద్దరూ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంత పెద్ద ప్రాజెక్టులో తాను నటించడం ఇదే మొదటిసారి అని.. ఈ సినిమాలో తాను తార అనే పాత్ర పోషించగా.. దుల్కర్ గారు రాజుగా కనిపించనున్నాడు.. మా ఇద్దరి మధ్య అందమైన ప్రేమ కథ ఉంది. ప్రేక్షకులు ఈ ప్రేమ కథకు చాలా ఫిదా అవుతారు.. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది.. అంతేకాదు ఈ ప్రేమ కథకు అద్భుతమైన సంగీతం తోడైంది.. ఈ మూవీ నా కెరియర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుందని చెప్పింది.
ఇక ఈ సినిమాతో తనకు మంచి పేరు మాత్రమే కాదు.. అవకాశాలు కూడా వస్తాయని తాను బలంగా నమ్ముతున్నాను అని చెప్పింది. చివరగా దసరా సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ బాగా నచ్చింది అని.. తనకు అలాంటి అవకాశాలు వస్తే నటించాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది.