రాజకీయ నాయకులకు, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నాయకులు సినిమాల్లోకి రావడం, సినిమాలకు పెట్టుబడులు పెట్టడం. నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించడం అనేది కొత్తేమి కాదు. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్కు కూడా ఒకప్పుడు సినిమాలంటే బాగా ఇష్టం.
మరో ట్విస్ట్ ఏంటంటే జగన్ నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానం సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు వచ్చిన టైంలో బాలయ్య కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అదే టైంలో జగన్ బాలయ్య నటించిన ఓ సినిమా సీడెడ్ రైట్స్ కొని దానిని పంపిణి కూడా చేశారట.
ఆ సినిమా ఏదో కాదు 2002 సంక్రాంతి కానుకగా వచ్చిన సీమసింహం. బాలయ్య , కెమేరామెన్ సీ రాం ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సీమసింహం తెలిసిందే. ఆ సినిమాలో సిమ్రాన్, రీమాసేన్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో సీమసింహం సీడెడ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు జగన్కు రాజశేఖర్ రెడ్డి కూడా కొంత అమౌంట్ హెల్ఫ్ చేశారట.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక షర్మిల పెట్టుబడులు పెట్టి ప్రభాస్ హీరోగా యోగి సినిమా నిర్మించారని అంటారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.