Newsదేశంలోనే హ‌య్య‌స్ట్ టిక్కెట్లు అమ్ముడైన తెలుగు సినిమా తెలుసా... ఆ రికార్డులు...

దేశంలోనే హ‌య్య‌స్ట్ టిక్కెట్లు అమ్ముడైన తెలుగు సినిమా తెలుసా… ఆ రికార్డులు ఇవే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అవుతోంది. మన సినిమాలకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తున్నాయి. మన సినిమాలు ఏకంగా 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నాయి. అయితే రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు సినిమా గురించి మాట్లాడితే అటు బాలీవుడ్ వాళ్ళు ఇటు తమిళం వాళ్ళు కూడా చాలా చులకనగా చూసేవారు. తెలుగులో పేరన్న డైరెక్టర్లు కూడా లేరని.. అసలు తెలుగు సినిమాలకు అంత సీన్ లేదని విమర్శలు చేసేవారు.

అప్పట్లోనే తమిళ డైరెక్టర్ శంకర్ దేశం మొత్తం మెచ్చే సినిమాలు తీసి బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ కి అంత సీన్ ఉందని ప్రూవ్ చేశారు. అయితే ఇప్పుడు సీన్‌ పూర్తిగా రివర్స్ అయింది. మన తెలుగు సినిమా బాలీవుడ్ ను కూడా తలదన్నేసి దేశం గర్వించే ఇండస్ట్రీగా ఎదుగుతోంది. 20 సంవత్సరాల క్రితం కూడా తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలు సంచలన విజయం సాధించాయి.

ఆ కాలంలోనే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాలకు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ సినిమాలలో ఒక సినిమాకు దేశంలోనే అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడైన రికార్డు ఉంది. ఆ సినిమా ఏదో కాదు విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ కలిసుందాం రా.. ఉదయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా సిమ్రాన్ నటించింది. 2000 సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి అన్నయ్య – బాలయ్య వంశోద్ధారకుడు సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన కలిసుందాం రా అప్రతిహత విజయం సాధించింది.

ముందు ఈ సినిమా కేవలం 78 కేంద్రాలలో మాత్రమే రిలీజ్ అయింది. అప్పటికే బాలయ్య వంశోద్ధారకుడు ,చిరంజీవి అన్నయ్య సినిమాలకు ఎక్కువ ధియేటర్లు కేటాయించారు. ఎప్పుడు అయితే క‌లిసుందాం రా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిందో.. అక్కడ నుంచి కలిసుందాం రా రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపేసింది. 14 సెంటర్లలో 175 రోజులు.. నాలుగు థియేటర్లలో 200 రోజులు నడిచింది.

200 రోజులపాటు నడిచిన కలిసుందాంరకు మొత్తం రెండు కోట్ల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ రికార్డును ఇప్పటికీ కూడా మరే సినిమా బీట్ చేయలేదు అంటే మాటలు కాదు. కేవ‌లం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కలిసుందాం రా.. ఆ రోజుల్లోనే రు. 25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news