మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. మెహర్ రమేష్ టాలీవుడ్ లో శక్తి – షాడో – కంత్రి లాంటి భారీ డిజాస్టర్ సినిమాలు తెరకెక్కించారు. దీంతో మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చేందుకు టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు కూడా సాహసం చేయలేదు. ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తో తీసిన షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని మెహర్ రమేష్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా తెరకెక్కించారు.
పైగా ఈ సినిమా కూడా తమిళంలో ఎప్పుడో ఆరేడు సంవత్సరాల క్రితం వచ్చిన అజిత్ వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఉత్కంఠ అయితే ఉంది. మెహర్ రమేష్ కామెడీ, స్టైలిష్ టేకింగ్, యాక్షన్ వర్క్ అవుట్ అయితే సినిమా గట్టెక్కుతుందన్న ఆశలు అయితే అభిమానుల్లో ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర – సుంకర రామబ్రహ్మం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసినందుకు మెహర్ రమేష్ కు రెమ్యునరేషన్ గా ఎంత ఇచ్చారు అన్నదానిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక న్యూస్ విశ్వసనీయంగా తెలిసింది. మెహర్ రమేష్‌కు ఈస్ట్, వెస్ట్ రైట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదికూడా కొంత అమౌంట్ కట్టించుకుని ఈ రెండు జిల్లాల రైట్స్ ఇచ్చారని సమాచారం. ఈ రెండు జిల్లాల రైట్స్ రు. 10 నుంచి 12 కోట్ల మధ్యలో ఉంటాయి.
మెహర్ రమేష్ కు అంత రెమ్యునరేషన్ ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వరు. అయితే ఈ రెండు జిల్లాల రైట్స్ కాస్త రీజనబుల్ రేటుకు ఇచ్చారని బోగట్టా. ఇక మెహర్‌కు గతంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం కూడా ఉంది. మహేష్‌బాబును పట్టుకుని సరిలేరు నీకెవ్వరు గుంటూరు రైట్స్ కూడా తీసుకున్నాడు.