Moviesబాల‌య్య‌తో ఒక్క సినిమా చేసి రిటైర్ అవుతామంటోన్న ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు…!

బాల‌య్య‌తో ఒక్క సినిమా చేసి రిటైర్ అవుతామంటోన్న ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు…!

ఆ బాల‌య్య వేరు.. ఇప్ప‌టి బాల‌య్య వేరు. ‘అఖండ’ సక్సెస్‌, ‘అన్‌ స్టాపబుల్ ‘ షో త‌ర్వాత బాల‌య్య ఇమేజ్‌, బాల‌య్య లెక్క‌లు మారిపోయాయి. ఇప్పుడు బాల‌య్య ఫ్యాన్‌ బేస్‌ రెట్టింపు అయింది. బాల‌య్య ఫ్యాన్స్‌లో గ‌తం కంటే బాగా జోష్‌ పెరిగింది. పారితోషికం విషయంలోనూ బాలయ్య హైలోనే ఉన్నాడంటున్నారు. ఇక అఖండ త‌ర్వాత ఈ సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహారెడ్డి కూడా సూప‌ర్ హిట్‌.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాల‌య్య సినిమాల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో బాల‌య్య చేస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రి సినిమా మానియా కూడా మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు. 100 కోట్ల రేంజ్‌లో జ‌రుగుతుందంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య బాబి సినిమా క‌మిట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా పూరి జ‌గ‌న్నాథ్‌, బోయ‌పాటి శ్రీను కూడా లైన్లో ఉన్నారు.

అయితే విచిత్రంగా గ‌తంలో బాలయ్య‌కు బ్లాక్బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన ఇద్ద‌రు సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు త‌మ కెరీర్‌లో చివ‌రి సినిమా బాలయ్య‌తోనే చేసి రిటైర్ అవుతామంటున్నారు. వారిద్ద‌రిలో ఒక‌రు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి. గోపాల్‌. బాలయ్య – గోపాల్ కాంబినేష‌న్లో స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు మొత్తం నాలుగు సూప‌ర్ హిట్లు ఉన్నాయి. ఆయ‌న బాలయ్య కాంబోలో సినిమా అంటే యేడాది కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.

గోపాల్ మంచి టీం సెట్‌ చేసుకుని బి.గోపాల్‌ బాలకృష్ణ స్టార్‌డమ్‌కు తగిన క‌థ రెడీ చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు టాక్ ? ఇక మ‌రో సినియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు కూడా బాల‌య్య కోసం ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 పేరుతో ఓ సినిమా చేస్తానంటూ రెండు, మూడేళ్లుగా తిరుగుతున్నాడు. మ‌రి వీరిద్ద‌రి కోరిక బాల‌య్య ఎప్ప‌ట‌కి తీర్చుతాడో ? వీరు ఎప్పుడు బాల‌య్య‌తో సినిమాలు చేస్తార‌న్న ప్ర‌శ్న‌ల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news