ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ క్రేజ్ రేంజ్ ఏ విధంగా ఉందో మనకి బాగా తెలిసిన విషయమే . కాగా ధడక్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టింది లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా అందాలను ఆరబోసి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ ఏకంగా తారక్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది .
తెలుగు ఇండస్ట్రీలోకి ఈ సినిమా ద్వారానే అడుగుపెడుతుంది జాన్వికపూర్ . రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడిన జాన్వి కపూర్ సౌత్ సినిమాల్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చిందో చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే జాన్వికపూర్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి . కాగా జాన్వి కపూర్ మాట్లాడుతూ..” కేవలం నార్తే కాదు సౌత్ కూడా నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండస్ట్రీ తనకు సొంత ఇంటి లాంటిది అనిపిస్తూ ఉంటుంది . సొంత ఇంటికి వచ్చిన ఫీలింగే కలుగుతుంది . అంతేకాదు నాకు సౌత్ జనాల నుండి అపారమైన ప్రేమ లభిస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను .అందుకే సౌత్ నా ఇంటి లాగే భావిస్తూ ఇక్కడ సినిమాలు చేస్తున్నాను . ఎప్పుడైనా హైదరాబాద్ కి వచ్చినా కూడా నా ఇంటికి వచ్చి వెళ్ళాను అన్న ఫీలింగ్ కలుగుతుంది “అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది.
దీంతో జాన్వీ కపూర్ తెలుగు జనాలకి బిస్కెట్ వేస్తుందని.. ఆమె దేవర సినిమా హిట్ అవ్వడానికి ఇలాంటి కబుర్లు చెబుతుందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!