News' బ్రో ' ప్రీమియ‌ర్ షో టాక్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిర్యానీ.....

‘ బ్రో ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిర్యానీ.. కామ‌న్ ఆడియెన్స్‌కు ప్లేట్ మీల్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా బ్రో. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సితం సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే, మాట‌లు స‌మ‌కూర్చ‌గా, స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఊర్వ‌శి రౌతేలా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన ఈ సినిమాలో ప‌వ‌న్ దేవుడిగా న‌టించాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా న‌టించారు. మ‌రి ప‌వ‌న్ మ్యాజిక్ ఈ సినిమాకు ఎంత వ‌ర‌కు ప‌ని చేసిందో చూద్దాం.

ఓవ‌ర్సీస్ టాక్ ప్ర‌కారం మార్కండేయ అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) చాలా స్వార్థపరుడు. తన ప్రయోజనాలు తప్ప ఇత‌రుల గురించి అస్స‌లు ప‌ట్టించుకోడు. క‌నీసం త‌న ఇంట్లో ఫ్యామిలీని కూడా నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు. అలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న మార్క్ ఓ ప్ర‌మాదంలో చ‌నిపోతాడు. ఆ టైంలో గాడ్ ఆఫ్ టైం (పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇచ్చి చనిపోయిన మార్క్ కి మ‌రో లైఫ్ ఇస్తాడు. గాడ్ ఆఫ్ టైం మార్క్ జీవితంలోకి వచ్చాక ఏం జ‌రిగింది … అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

ఇక ఫ‌స్టాఫ్‌లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ ఎంట్రీ హైలెట్ అంటున్నారు. సాయి ధరమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వ‌చ్చే సీన్లు, కామెడీ అయితే ఫ్యాన్స్‌కు ఫుల్ పండ‌గే. పవన్ మ్యాన‌రిజ‌మ్‌, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. ఇక ప‌వ‌న్ నుంచి ఎంజాయ్ చేసే సీన్లు అయితే ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు. ప‌వ‌న్ డ్యాన్సులు, టైమింగ్ జోక్స్ అదిరిపోయాయంటున్నారు.

ప‌వ‌న్ పై త్రివిక్ర‌మ్ రాసిన పొలిటిక‌ల్ డైలాగులు, పంచ్‌లు, ముఖ్యంగా గాజు గ్లాసుమీద రాసిన డైలాగులు కేకే. ఇక థ‌మ‌న్ బీజీఎం అదిరిపోయింది. సాయిధ‌ర‌మ్ కూడా ప‌వ‌న్ కు ధీటుగానే న‌టించాడు. అయితే డామినేటింగ్ పాత్ర కావ‌డంతో ఒక్కోసారి ప‌వ‌న్ కంటే ఓ మెట్టు పైన ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ పాత్ర‌ను ఎలివేట్ చేయ‌డం మీద కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో క‌థ‌లో డెప్త్ లేద‌ని.. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే కూడా అంత మ్యాజిక్ చేయ‌లేదంటున్నారు.

వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ వీక్‌గా ఉంద‌ని.. విజువ‌ల్స్ బాగోలేద‌ని.. అవి ప‌వ‌న్ రేంజ్‌లో లేవంటున్నారు. హీరోయిన్స్ కేతిక శర్మ, ప్రియా వారియర్స్ తమ పాత్రల వ‌ర‌కు బాగానే మెప్పించారు. వాళ్లకు చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ లేదని… సినిమా అంతా సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ మీద సాగుతుంద‌ని ఓవ‌ర్సీస్ టాక్‌.

ఫైన‌ల్గా…
బ్రో మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మేనరిజం, టైమింగ్ డైలాగ్స్, డాన్సులు ఫీస్ట్ హైలెట్‌. సినిమాలో బలమైన స్టోరీ లేకున్నా పవన్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ లాగించేశారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. అదే టైంలో వీక్ స్టోరీ, ఓవర్ సినిమాటిక్ సీన్స్ కాస్త నిరాశపరుస్తాయి. పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌.. కామ‌న్ ఆడియెన్స్ ప్లేట్ మీల్స్‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news