Moviesలావణ్య్-వరుణ్ పెళ్ళి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డేనే ముహూర్తం...

లావణ్య్-వరుణ్ పెళ్ళి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డేనే ముహూర్తం ఫిక్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్.. రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్ . దీనికి సంబంధించిన పిక్స్ షేర్ చేసుకొని అభిమానులకి గుడ్ న్యూస్ అందజేశాడు. కాగా నిశ్చితార్థం తర్వాత కాబోయే భార్యతో ఫారిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసిన వరుణ్ దానికి సంబంధించిన పిక్స్ ని కూడా షేర్ చేసుకున్నారు .

రీసెంట్ గానే వరుణ్ – లావణ్య త్రిపాఠి ఇటలీలో దిగిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోస్ లో ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ చేశారు మెగా అభిమానులు . ఇలాంటి క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక్కటయ్యే క్షణం రానే వచ్చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. వీళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది . ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు అంటూ జనాలు ఆ డేట్ ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

ఆగస్టు 24వ తేదీ ఇటలీలో వీళ్ళ పెళ్ళి గ్రాండ్గా జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులు చూసుకోవడానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి స్వయంగా ఇటలీకి వెళ్లి తమ పెళ్ళికి కావాల్సిన అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది .అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెడ్డింగ్ కి అటెండ్ కావట్లేదు అంటూ తెలుస్తుంది . కేవలం మెగా – అల్లు కుటుంబం మాత్రమే ఈ పెళ్ళికి అటెండ్అవ్వబోతున్నారని పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారని ..దానికి మాత్రం సినీ రాజకీయ ప్రముఖులు అందరూ హాజరు అవ్వబోతున్నారు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news