సినిమా ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన ఏకైక హీరోయిన్ సౌందర్య. అసలు ఈమెకు శత్రువులు ఉన్నారా ..? అనే డౌట్లు కూడా కలుగుతాయి . అంతలా తన అందంతో అభినయంతో నటనతో ఇండస్ట్రీలు చెరగని ముద్ర వేయించుకుంది సౌందర్య. ఈమె మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లి చాలా సంవత్సరాలు గడుస్తుంది . అయినా ఇప్పటికీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లకు ధీటుగా సౌందర్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ..అంటే దానికి కారణం ఆమె తెర పైన నటించిన పాత్రలనే చెప్పాలి .
తాను నటించే పాత్రల్లో ఒదిగిపోయి నటించే సౌందర్య ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా తనపై రిమార్క్ వేసుకోలేదు . అయితే ఇంత సైలెంట్ గా ఉన్న హీరోయిన్ పై కొందరు కావాలని చెత్త రూమర్ల క్రియేట్ చేశారు. మరి ముఖ్యంగా వరుసకు అన్నయ్య వాడితో అక్రమ సంబంధాన్ని క్రియేట్ చేసి దారుణంగా కామెంట్స్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఇదే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే జగపతిబాబు – సౌందర్యలది ఎవర్ గ్రీన్ హిట్ కాంబో .
వీళ్ళు కలిసి తెరపై కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే . అయితే తెరపై వీళ్ళ కెమిస్ట్రీ బాగుండడంతో నిజంగానే ప్రేమించుకుంటున్నారని.. వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం చేశారు కొందరు ఆకతాయిలు . అయితే సౌందర్య తనకు చెల్లి లాంటిదని.. జగపతిబాబు చాలా సందర్భాలలో చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మేం ఇద్దరం స్క్రీన్ పై కలిసిన నటించడం ద్వారా మా మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడిందని .. ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే ఒకరి ఫంక్షన్లకు ఒకరు అటెండ్ అయ్యే వాళ్ళమని .. అంతే తప్పిస్తే మా మధ్య ఏ సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయినా సరే కొందరు పని పాట లేని ఆకతాయిలు.. ఆమెపై దారుణంగా ట్రోలింగ్కి గురిచేస్తున్నారు..!!