టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న రష్మిక మందన అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూనే ఉంటుంది రష్మిక మందన్నా. రీసెంట్ గ ఓ చిట్ చాట్ లో పాల్గొన్న రష్మిక ఎంతలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే.
అయితే తాజాగా రష్మిక మందన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా రష్మిక మందన సోఫాలో స్టైలిష్ గా కూర్చొని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్న ఫోటోలో దర్శనమిచ్చింది . అయితే ఆ ఫోటోలో అమ్మడు నవ్వు ఆపుకుంటున్నట్లు రెండు చేతులతో తన నోరు మూసేసుకుంది. ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ జనరల్ గా చాలా విషయాలపై నా స్పందన ఇదే అంటూ రాసుకొచ్చింది.
అంతేకాదు నోరు మూసుకొని ఉన్న ఎమోజిని – స్మైలీని – లవ్ ఎమోజిని పంచుకుంది . దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ మధ్యకాలంలో రష్మిక మందన చాలా విషయాల్లో ట్రోలింగ్ కి గురవుతుంది . రష్మిక మందన విజయ్ దేవరకొండతో బ్రేకప్ అయిందని .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎఫైర్ నడుపుతుందని .. అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తుందని ..నానా విధాలుగా ట్రోల్ చేశారు . వాటన్నిటికీ ఇదే నా సమాధానం అనే విధంగా చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చింది అంటూ రష్మిక ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏ విషయం అయినా సరే ఎంత ఘాటుగా రెస్పాండ్ అవ్వాలనుకున్న సరే ..కూల్ గానే చెప్పాలనుకున్న మాటని చెప్పేస్తుంది రష్మిక అంటూ పొగిడేస్తున్నారు . మొత్తానికి రష్మిక పరోక్షంగా నోరు మూసుకోండి అంటూ ట్రోలర్స్ కి కౌంటర్ వేసింది అన్నది అభిమానులకి జనాలకి ఇట్టే అర్థమవుతుంది..!!