జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు బాగా తెలిసిన విషయమే . కాగా ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదే మాట్లాడే అనసూయ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఎలా ట్రోలింగ్ కి గురైందో కూడా మనకు తెలిసిందే . ఆమెను ఆంటీ ఆంటీ అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు..అయితే అనసూయ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
కాగా ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ చూస్తుంటే దేవరకొండ ఫ్యామిలీకు అనసూయ దగ్గరైనట్లే తెలుస్తుంది . ఇది విజయ్ దేవరకొండ ఫాన్స్ ని కూల్ చేయడానికో..? లేక ఆనంద దేవరకొండకు సపోర్ట్ చేయడానికో తెలియదు కానీ.. రీసెంట్గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా స్పందించింది . మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేశాడు . ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమాను చేశాడు .
ఈ సినిమా జులై 14న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది యూట్యూబర్ వైష్ణవి చైతన్య . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గానే ట్రైలర్ రిలీజ్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది . అయితే అనసూయ సైతం..” ట్రైలర్ చాలా బాగుంది అని.. తెలిసిన వాళ్ళ కధలానే ఉంది అని ..యాక్టింగ్ పరంగా ఆనంద్ దేవరకొండ బాగా నటించాడు అని .. వైష్ణవి చైతన్య సైతం బాగుంది అని.. సినిమాకి ఆల్ ద బెస్ట్ ” అంటూ పాజిటివ్ గా ట్విట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది..!!