సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే . మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్న ఈమె అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది . ఆమె 40 సంవత్సరాలు నిండకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది . అయితే సౌందర్య మరణించిన తర్వాత ఆమె మరణానికి కారణం ఓ సినిమా అని .. ఆ సినిమాలో నటించడం కారణంగానే చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది అంటూ ప్రచారం జరిగింది.
ఆశ్చర్య ఏంటంటే పలువురు పండితులు జ్యోతిష్యక్కులు కూడా అదే విషయాన్ని కన్ఫామ్ చేశారు . కాగా సౌందర్య ఎన్నో సినిమాలు నటించింది . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ చంద్రముఖి కన్నడలో డబ్బింగ్ చేసిన “ఆప్తమిత్రా” లో కూడా నటించింది . ఈ సినిమాలో నాగవల్లి పాత్రలో సౌందర్య మెప్పించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కన్నడ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ ఫిలిం గా రికార్డు నెలకొల్పింది. అయితే ఆ సినిమా చేస్తున్న టైంలో ఆమెను ఏదో శక్తి ఆవహించిందని.. ఆ శక్తి వల్లే సౌందర్య మరణించింది అంటూ అప్పట్లో జనాలు జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు .
అంతేకాదు శశికళ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈ సినిమాలోని నాగవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్తున్నన్ని రోజులు ఆమె చుట్టూ ఏదో శక్తి ఆవహించిన్నట్లు ఉండిందట . ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకురావడం గమనార్హం. అయితే ఆప్తమిత్ర2 సినిమాలో నటించిన హీరో విష్ణువర్ధన్ కూడా మరణించడం ఇక్కడ గమనించాల్సిన విషయం . సినిమా షూట్ చేస్తున్నప్పుడు బాగానే ఉన్నా సినిమా షూటింగ్ అయిపోయిన కొద్ది రోజులకే మరణించాడు . ఆయనకు ఎటువంటి అనారోగ్యం కూడా లేదు . దీంతో వీరి చావులకు ఈ సినిమాలోని పాత్రికు ఏదో లింక్ ఉందని చాలామంది భావించారు . మరి ముఖ్యంగా కొంతమంది అభిమానులు సౌందర్య ఆ పాత్ర చేయడం వల్లే మరణించింది అంటూ ఫిక్స్ అయిపోయి దారుణంగా సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు..!!