ఈ మధ్యకాలంలో మీడియా ప్రతినిధులు చాలా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీ తెచ్చుకున్న క్రేజ్ ఇప్పుడు మీడియా రిపోర్టర్స్ కు దక్కింది . దానికి కారణం పలువురు సెలబ్రిటీస్ ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతూ.. పర్సనల్ లైఫ్ లోని ..విషయాలను ఓపెన్ గా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు . ఇలాంటి క్రమంలోనే అలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ .
కాగ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే పనిలో బిజీ అయిపోయిన ఆనంద్ దేవరకొండ.. తాజాగా నటిస్తున్న సినిమా బేబీ . రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది . ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నింది. జులై 14న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన చిత్ర బృందానీ పలు రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేశారు రిపోర్టర్స్ . ఈ క్రమంలోని ఆనంద దేవరకొండను సైతం ఓ ప్రశ్న అడిగి షాకింగ్ కి గురి చేశారు . రష్మిక ” బేబీ” సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో అందరూ వదిన అంటూ వచ్చారు. దానిపై మీ స్పందన ఏంటి..? అంటూ ఆనంద్ దేవరకొండ ను స్ట్రైట్ గా అడిగేసాడు . దీంతో స్పాట్లోనే ఏం చేయాలో అర్థం కాక ఆనంద్ “నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను .. ఆపేస్తున్నాను” అంటూ కామెంట్ చేశాడు. అంటే దానిపై ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదో..? లేక విజయ్ దేవరకొండ రష్మిక మందన నిజంగానే విడిపోయారో..? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!