లైఫ్ లో ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ..ఆ నిర్ణయం కారణంగా వచ్చే బాధలను ఫేస్ చేయాల్సి ఉంటుంది . జీవితంలో చాలా మంది మనుషులు తెలిసో తెలియకో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు . అయితే ఆ నిర్ణయం తప్పు అని తెలిసి సరైన టైంలో సరిదిద్దుకుంటే ఆల్ హ్యాపీస్ . ఆ తప్పుని తెలుసుకోలేకపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది . ప్రెసెంట్ అలాంటి తప్పు చేసే కెరియర్లో నానా తిప్పలు పడుతుంది అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులర్ సంపాదించుకున్న అనుష్క శెట్టి ప్రజెంట్ ఎలాంటి క్రేజీస్దానాని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సినిమా ఇండస్ట్రీలో దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా సరే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది అంటే అమ్మడుపై ఫ్యాన్స్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. కాగా సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న అనుష్క శెట్టి మరి కొద్ది రోజుల్లోనే “మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమా ద్వారా అభిమానులను పలకరించబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే అనుష్క తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వైరల్ గా మారాయి.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అనుష్క కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేయడం .. రిస్క్ పాత్రలను చూస్ చేసుకోవడం ఆమె చేసిన బిగ్గెస్ట్ తప్పంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా సైజ్ జీరో కోసం ఆమె నిజంగానే వెయిట్ గెయిన్ అవ్వడం ..ఆ తర్వాత బరువును తగ్గించుకోలేక తిప్పలు పడడం ..ఇప్పటికీ ఆ బరువు కారణంగా అవకాశాలు రాలేకుండా పోతూ ఉండడం.. ఆమె కెరియర్ నాశనం అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అప్పుడు అనుష్క అలాంటి రిస్క్ చేయకుండా ఉంటే ..ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకొని ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!