Moviesఆ భయం కారణంగా "సల్లార్‌" సినిమాను మిస్ చేసుకున్న.. ఆ అన్...

ఆ భయం కారణంగా “సల్లార్‌” సినిమాను మిస్ చేసుకున్న.. ఆ అన్ లక్కి తెలుగు హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “సల్లార్”. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా రెండు పార్టులు గా రాబోతుంది అని కొద్దిసేపటి క్రితిమే రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా తెలిసిపోతుంది . ఈ సినిమాపై అభిమానుల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . మరి ముఖ్యంగా కే జి ఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలోనూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు ప్రముఖులు .

కాగా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన టీజర్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకునింది. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అయితే ఇలాంటి క్రమంలోనే సలార్ సినిమాని చేతులారా మిస్ చేసుకున్న ఓ తెలుగు హీరో గురించి వార్తలు తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఆ హీరో మరెవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.

ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కధని ప్రశాంత్ నీల్ మొదటగా బన్ని కి వివరించారట. అయితే పుష్ప సినిమాలాగే ఇది కూడా మాస్ కంటెంట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ మాస్ కంటెంట్ చిత్రాలలో నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుందన్న భయం కారణంగా ఈ సినిమా రిజెక్ట్ చేసారట. ఆ తర్వాత ఈ కథ కోసం చాలా మంది హీరోలను అప్రోచ్ అవ్వగా.. ఫైనల్లీ ప్రభాస్ ఓకే చేశాడు . దీంతో ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news