Moviesటైం చూసి కొట్టిన కాజల్ అగర్వాల్.. బన్ని పై సెన్సేషనల్ కామెంట్స్...

టైం చూసి కొట్టిన కాజల్ అగర్వాల్.. బన్ని పై సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ చందమామగా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల అగర్వాల్ తన పేరు మరోసారి టాప్ రేంజ్ లో ఉండాలి అంటూ తెగ తాపత్రయపడుతుంది . ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్గా మారి అభిమానులతో ఎప్పటికప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉంది. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న ఈ బ్యూటీ బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలోనూ నటిస్తుంది.

అంతేకాదు పలు లేడీ ఓరియంటెడ్ ఫీలింస్ కి కూడా సైన్ చేసింది కాజల్ అగర్వాల్ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీ ధింగ్ అనే సెషన్ కండక్ట్ చేసిన కాజల్ కి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి . ఈ క్రమంలోనే ఓ నెటిజన్..” నన్ను పెళ్లి చేసుకుంటావా..?” అంటూ అడిగేశారు . అయితే “ఆ అదృష్టం రెండేళ్ల క్రితం వేరే వాళ్లకు దక్కేసింది” అంటూ సరదాగా కౌంటర్ వేసింది కాజల్ .

ఇదే క్రమంలో బన్నీ ఫాన్స్ బన్నీపై మీ ఒపీనియన్ ఏంటి ..? అంటూ అడగగా.. ఆమె ఓపెన్ గా బన్నీ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. ” నేను వర్క్ చేసిన హీరోలలో నాకు నచ్చిన ఫస్ట్ వ్యక్తి అల్లు అర్జున్. ఆయన ఎనర్జీ ఎంతగానో ఇష్టపడతాను ..ఆయనతో డాన్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం ” అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. దీంతో ఇవే కామెంట్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news