సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ..రోజుకో అందాలు ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న చెడ్డీలతో ..మిడ్డీలతో.. బికినీలతో రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తున్నా కానీ అందరికీ ఫేవరెట్ హీరోయిన్ గా ఉండేది మాత్రం వన్ అండ్ ఓన్లీ హీరోయిన్స్ స్నేహ. చాలా హోమ్లీగా.. చాలా ట్రెడిషనల్ గా ..చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి అనే విధంగా ఉండే స్నేహ ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . తెలుగు ఇండస్ట్రీలో అసలు సినిమాలు చేయడమే మానేసింది .
ఎందుకంటే ఆమెకు తగ్గ పాత్రలు డైరెక్టర్స్ ఇవ్వడం లేదు . సీనియర్ పాత్రలైనా సరే పద్ధతిగా ఉంటేనే చేస్తానంటూ గిరి గిసి పెట్టుకున్న స్నేహ రకరకాల ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . చిట్టి పొట్టి బట్టలతో సోషల్ మీడియాని అల్లాడించే అందాల ముద్దుగుమ్మలు ఉన్న ఈ జనరేషన్లో కూడా నిండైన వస్త్రాలతో ఆకర్షణీయంగా కనిపించే స్నేహ ఉండడం అదృష్టమనే చెప్పాలి. కాగ ఏజ్ 41 దాటేస్తున్న ఇప్పటికి చాలా చక్కగా చూడముచ్చటగా ఉండే స్నేహ అందం విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడిన స్నేహ తన అందం కోసం నాచురల్ ప్రొడక్ట్స్ ని వాడుతానంటూ చెప్పుకొస్తుంది . వారానికి రెండుసార్లు సున్నిపిండి స్నానం చేసే స్నేహ .. కనీసం వారానికి ఒక్కసారి అయినా ముఖానికి పసుపు రాస్తుందట . అంతేకాదు పాలు – పెరుగు – మిగడ – బీట్రూట్ – ఓట్ స్క్రబ్బర్ ఎక్కువగా యూస్ చేస్తుందట . అంతేకాదు ఉదయం లేవగానే కొబ్బరి నీళ్ళు లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తాగుతుందట .
ఫుడ్ డైట్ అంటూ ఏమి పెట్టుకొని స్నేహ ..కడుపునిండా అన్నం తింటూనే హెల్తీ డైట్ ను ఫాలో అవుతూ ఉన్న కారణంగానే స్నేహ ఇంత యాక్టివ్ గా.. ఇంత ఫిట్ గా ఉండగలుగుతుందట . ఈ క్రమంలోనే స్నేహ డైట్ సీక్రెట్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!