ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలా బోల్డ్ కంటెంట్ ని చేయడానికి ఇష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే బోల్డ్ కంటెంట్ కాదు దానికి మించిన రేంజ్ లో కంటెంట్ ఇవ్వడానికి ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన అన్ని వెబ్ సిరీస్ లు దానికి ప్రత్యేక నిదర్శనం . కాగ రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కూడా హాట్ బ్యూటీగా మారిపోయింది .
ఎంత బోల్డ్ గా కనిపించిందో లస్ట్ స్టోరీస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే . కాగా ఈ క్రమంలోనే తాను చేసిన తప్పును పాజిటివ్ గా మార్చుకుంటూ శృంగారంపై మృణాల్ ఠాకూర్ బోల్డ్ కామెంట్స్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2 గురించి మాట్లాడుతూ ఆమె చేసే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ..” ఈరోజుల్లో శృంగారం – కామం అనేది చాలా కామన్ గా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు . నిజానికి అదే కరెక్ట్ . ఈరోజుల్లో పిల్లలకి అసలు శృంగారం అంటే ఏంటి..? అట్రాక్షన్ అంటే ఏంటి..? అనేది క్లియర్గా చెప్పాలి . అప్పుడే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు . వాటి గురించి మనం మాట్లాడడానికి సిగ్గుపడకూడదు . ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోనే పిల్లలకు నిజాయితీగా వివరిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంటుంది” అంటూ చాలా చాలా బోల్డుగా హాట్ గా మాట్లాడింది . దీంతో సీతారామం సినిమాలో మేము చూసిన మృణాల్ ఠాకూర్ నేనా.. ఈ బోల్డ్ బ్యూటీ అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు మృణాల్ లో ఇంత బోల్డ్ యాంగిల్ ఉందా అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!