తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయరు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ . తెలుగు బ్యూటీనే అయిన తెలుగులో అస్సలు పాపులారిటీ సంపాదించుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ తమిళం లో ఏడాదికి 7-8 సినిమాలు పైగానే చేస్తూ స్టార్ బ్యూటీగా రాజ్యమేలేస్తుంది . అయితే టాలీవుడ్ పై ఉండే మక్కువతో ఇక్కడ కూడా సినిమాలు చేయాలని ..చాలా తాపత్రయ పడుతున్న అమ్మడికి సరైన అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే వచ్చిన అరాకోరా కూడా అంతంత మాత్రమే ఉండడంతో తెలుగు జనాలకు ఐశ్వర్య రాజేష్ దూరం అయిపోతుంది . అయితే పర్ఫెక్ట్ బాడీ ఫిజిక్ ను మైంటైన్ చేస్తున్నా కానీ ఎందుకు ఐశ్వర్య రాజేష్ కి తెలుగు హీరోలు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఐశ్వర్య రాజేష్ కలర్ తక్కువ.. అంతేకాదు ఉన్నది ఉన్నట్లే ఫేస్ మీద మాట్లాడుతుంది.
ఇండస్ట్రీలో ఏ హీరో కైనా డప్పు కొట్టే హీరోయిన్స్ అంటేనే ఇష్టం ..మరి ఐశ్వర్య రాజేష్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు అవకాశాలు ఇస్తారు..? అనేది అభిమానుల పాయింట్ . అంతేకాదు కలర్ కూడా చాలా తక్కువ కావడం.. అంతేకాకుండా మేకప్ వేస్తే మరో వేరే విధంగా కలర్ మారిపోవడంతో ..ఐశ్వర్య రాజేష్‌ను తెలుగులో గ్లామరస్ బ్యూటీగా చూడలేకపోతున్నారు హీరోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . కొంచెం కలర్ ఎక్కువై ఉంటే ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్గా మారిపోయి ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు..!!