ఈ మధ్యకాలంలో రాజకీయాలలో ఎలా హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీలోనే పద్ధతిగా ఉన్నారు అని చెప్పుకోవాల్సినంత దారుణంగా తయారైపోయింది నేటి కాలం రాజకీయం . కాగా రీసెంట్గా తమిళనాడు స్టార్ సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కుష్బూపై రాజకీయ నేత చేసిన అసభ్యకర కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారాయి .
సౌత్ ఇండస్ట్రీలోని సీనియర్ నటిగా పేరు సంపాదించుకున్న కుష్బూ ఆ మాటలకు కన్నీరు పెట్టుకుంది. దీనితో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తమిళనాట గుడి కట్టే అంత అభిమానులు ఉన్న ఆమెను ఓ రాజకీయ నేత నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో కుష్బూను నానా మాటలు మాట్లాడి దూషించడం ఆమె అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది . ఆ వ్యక్తి డిఎంకె పార్టీకి చెందిన వాడు కావడంతో మరింత రేంజ్ లో అభిమానులు ఫైర్ అయిపోతున్నారు. ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
కాగా తమిళనాడు రాజకీయాలు మరింత దిగజారుడు స్థాయికి వెళ్లిపోయాయి అంటున్నారు జనాలు . ఒక్కోసారి కొంతమంది చేసే పనులు చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు . తాజాగా అలాంటి సంఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకి చెందిన పార్టీ నాయకుడు కృష్ణమూర్తి ప్రముఖ నటి సీనియర్ హీరోయిన్ తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి కుష్బూపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కుష్బూపై రివెంజ్ తీర్చుకున్నాడు . పర్సనల్గా అటాక్ చేస్తూ ఆమె సినిమా ఇండస్ట్రీలోని వ్యవహారాలను బయట పెట్టాడు .
అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభుతో ఆమెకు ఇల్లీగల్ అఫైర్ అంట కడుతూ హాట్ టాపిక్ గా కామెంట్స్ చేశారు . దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది . అయితే రీసెంట్గా కుష్బూ ఈ వీడియో పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది . ఆమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణమూర్తి పై ఫైర్ అయింది . అంతేకాదు కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలోనే డిఎంకె కార్యకర్త ఆయనని సస్పెండ్ చేసింది . పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించేసింది . అంతేకాదు కుష్బూ మాట్లాడుతూ ” ఆడవాళ్ళ కోసం నేను ఎన్నో పోరాటాలు చేస్తున్నాను ..అలాంటి నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమేనా” అంటూ బాధపడింది. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో మీకు ఆడవాళ్లు ఉన్నారు అని ఆలోచిస్తే బాగుంటుంది అంటూ మండిపడింది. దీంతో కుష్బూ మాటలు వైరల్ గా మారాయి..!!