MoviesBIGG BOSS 7: హౌస్ లోకి వెళ్ల బోయే కంటెస్టెంట్ల...

BIGG BOSS 7: హౌస్ లోకి వెళ్ల బోయే కంటెస్టెంట్ల కంప్లీట్ లిస్ట్ ఇదే.. అందరు తోపులే..!!

తెలుగు టెలివిజన్ పై అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. కాగా బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్.

అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్టుగా నాగార్జున చేయడం లేదు.. యంగ్ హీరో రానా దగ్గుబాటి షోని హోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు గతంలో లాగా కంటెస్టెంట్స్ ని చీప్ రేట్ కి మాట్లాడి హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనుకోవడం లేదు . అందుకే ఈసారి మొత్తం స్టార్ సింగర్స్ ని బడా బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్ లని లోపలికి పంపిస్తుంది .

కాగ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లిస్టులోకి న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహనా భోగరాజు, యాంకర్ రష్మీ,సింగర్ మంగ్లీ . కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఓ విడాకులు తీసుకున్న జంటను కూడా లోపలికి పంపించబోతున్నారట .

వాళ్ళు మరెవరో కాదు సింగర్ నోయల్ ఆయన మాజీ భార్య ఇస్తర్. అలాగే దీపిక పిల్లి.. యూట్యూబ్ నిఖిల్ , నటి ఐశ్వర్య , సింగర్ హేమచంద్ర , డాన్సర్ శ్వేతా నాయుడు , నటి మిత్ర శర్మ, నటి శోభా శెట్టి, ట్రాన్స్ జెండర్ తన్మయి మోడల్ సాయి రోనాక్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఈ లిస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news