Movies‘నేను స్టూడెంట్ సర్’ మూవీ రివ్యూ : ఒకే సినిమాలో...

‘నేను స్టూడెంట్ సర్’ మూవీ రివ్యూ : ఒకే సినిమాలో ఇన్ని ట్విస్టులా..?

సినిమా: నేను స్టూడెంట్ సర్
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముధ్రఖని, సునీల్ తదితరులు
మ్యూజిక్: సాగర్ మహతి
దర్శకుడు: రాకేశ్ ఉప్పలపాటి
రిలీజ్ డేట్: 02-06-2023

బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేయగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందించారు. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
సుబ్బు(బెల్లంకొండ గణేశ్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. యూనివ‌ర్సిటీ స్టూడెంట్‌ అయిన సుబ్బు ఎప్పటికైనా ఓ ఐఫోన్ కొనాలని చూస్తుంటాడు. దానికోసం చిన్నాచితక పనులు చేస్తూ, డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే.. ఓ ఐఫోన్ కొనుకున్న సుబ్బు, తొలిరోజే తన ఫోన్‌ను పోగొట్టుకుంటాడు. పోలీసులే తన ఫోన్ కొట్టేశాడంటూ వారితో గొడవకు దిగుతాడు. ఈ క్రమంలోనే కమిషనర్‌తో సుబ్బు ఎందుకు గొడవకు దిగుతాడు.. అసలు సుబ్బు ఫోన్ ఎవరు కొట్టేశారు.. చివరికి అతడికి ఫోన్ దొరుకుతుందా లేదా అనేది సినిమా కథ.

విశ్లేషణ:
చిన్న పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పాలి. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నా, దీన్ని మలిచిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయదు. ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరో తన కల కోసం ఏం చేస్తాడనేది మనకు చూపెట్టారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్‌ను కొనుక్కు్న్న సుబ్బు, దాన్ని పోగొట్టుకోవడంతో నిరాశకు లోనవుతాడు. ఈ క్రమంలోనే పోలీసులతో గొడవకు దిగుతాడు హీరో. ఒక్క ఫోన్ కోసం పోలీసులతో గొడవకు దిగడం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది.

ఇక పోలీస్ కమిషనర్ కూడా ఈగోకి వెళ్లి హీరోతో గొడవ పడటం ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ఇక కమిషనర్ కూతురితో హీరో లవ్ స్టోరీ.. ఆ తరువాత కథలో ఓ సాలిడ్ ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుల్లో సినిమా సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అటు సెకండాఫ్‌లో సినిమా కథలో మరో కీలక అంశాన్ని చూపెట్టారు. ఓ భారీ స్కామ్‌ను మనకు చూపెట్టాడు దర్శకుడు. ఈ స్కా్మ్‌ను హీరో ఎలా చేధించాడు అనేది ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ఓవరాల్‌గా ‘నేను స్టూడెంట్ సర్’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టారా అనేది సినిమా చివర్లో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా బెల్లంకొండ గణేశ్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. అయితే బోరింగ్ ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్‌గా నిలిచాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
‘స్వాతిముత్యం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ గణేశ్, ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో మంచి మార్కులు వేసుకున్నాడు. స్టూడెంట్‌గా హీరో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అవంతిక దస్సాని యాక్టింగ్‌లో చాలా నేర్చుకోవాలి. పోలీస్ కమిషనర్ పాత్రలో సముధ్రఖని సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేమియో పాత్రలో నటించిన సునీల్ కూడా ఆకట్టకున్నాడు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. సినిమాలో ట్విస్టులను చాలా చక్కగా చూపెట్టారు. అయితే కొన్ని లాజిక్ లేని సీన్స్‌ను తొలగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఏమాత్రం చెప్పుకునే విధంగా లేదు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

చివరగా:
నేను స్టూడెంట్ సర్ – ఒకే సినిమాలో ఇన్ని ట్విస్టులా..?

రేటింగ్:
2.5/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news