Moviesతెలుగు అమ్మాయిలకు అది తక్కువగా ఉంటుందా..? అందుకే అవకాశాలు ఇవ్వట్లేదా..?

తెలుగు అమ్మాయిలకు అది తక్కువగా ఉంటుందా..? అందుకే అవకాశాలు ఇవ్వట్లేదా..?

సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ ఎప్పటినుంచో పలువురు అమ్మాయిలు సినీ స్టార్స్ మొత్తుకుంటున్నారు. అయినా కానీ ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వట్లేదు స్టార్ట్ హీరోలు. ఇలాంటి వాటిపై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న తేజ . మనకు తెలిసిందే తేజ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీకి ఎలాంటి హిట్ సినిమాలు అందించారో. మరి ముఖ్యంగా జయం సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన టీవీకి అతుక్కుపోయి సినిమాలు చూస్తూ ఉంటారు.

వాళ్లలో అంత మంచి డైరెక్షన్ తో జనాలను ఆకట్టుకున్నాడు తేజ . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తేజ తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఒకటి కూడా హిట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ “అహింస” అనే సినిమాను తెరకెక్కించారు . కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజకు..” ఎందుకు తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావట్లేదు.. ఇవ్వట్లేదు ..? అని హోస్ట్ ప్రశ్నించగా .. తెలుగు అమ్మాయిలకు సహనం చాలా తక్కువ అని.. ఆరు నెలలు ఆగండి ..సినిమా అవకాశాలు వస్తాయి.. అని చెప్పే లోపే వాళ్లు వేరే కమిట్మెంట్ ద్వారా ముందుకెళ్ళిపోతున్నారని ..వాళ్లకున్న ఇబ్బందుల కారణంగా కావచ్చు కొందరు బలవంతం చేయడం కారణంగా కావచ్చు ..

అందుకే తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు” అంటూ పరోక్షకంగా ఘాటుగానే కౌంటర్ వేశారు తేజ . దీంతో తేజ మాటలు పై తెలుగు అమ్మాయిలు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు పక్క ఇండస్ట్రీ అమ్మాయిలు కోసం అయితే కథలు రెడీగా ఉంటాయని.. తెలుగమ్మాయిలు చూస్తే మాత్రం ఆ కథలను ఓకే చేయరని ఘాటుగా రిప్లై ఇస్తున్నారు డైరెక్టర్ తేజ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news